Telangana Schools: మోగిన బడి గంట.. వేసవి సెలవుల తర్వాత ఇవాళ్టి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం

తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. వేసవి సెలవులు జూన్ 11వ తేదీతో ముగిశాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పిల్లలతో సందడిగా మారాయి. ప్రభుత్వ బడుల్లో పిల్లల చేరికలను ప్రోత్సహించేందుకు రేవంత్‌ సర్కార్ బడి బాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం జూన్ 19వ తేదీ వరకు కొనసాగనుంది. స్టేషనరీ, బ్యాగులు, బూట్లు, దుస్తుల కొనుగోళ్లతో..

Telangana Schools: మోగిన బడి గంట.. వేసవి సెలవుల తర్వాత ఇవాళ్టి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం
Telangana Schools Reopend
Follow us

|

Updated on: Jun 12, 2024 | 9:24 AM

హైదరాబాద్‌, జూన్‌ 12: తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. వేసవి సెలవులు జూన్ 11వ తేదీతో ముగిశాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పిల్లలతో సందడిగా మారాయి. ప్రభుత్వ బడుల్లో పిల్లల చేరికలను ప్రోత్సహించేందుకు రేవంత్‌ సర్కార్ బడి బాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం జూన్ 19వ తేదీ వరకు కొనసాగనుంది. స్టేషనరీ, బ్యాగులు, బూట్లు, దుస్తుల కొనుగోళ్లతో పుస్తక దుకాణాలతోపాటు దుస్తుల షాపులు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతుంటాయి.

మారిన పాఠశాలల వేళలు….

మరోవైపు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాలల పని వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రోజు నుంచి ఉదయం 9 గంటలకే బడి గంట మోగనుంది. ప్రైవేట్ పాఠశాలల్లో 8 గంటలకే తరగతులు ప్రారంభం అవుతుంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 9.30కు మొదలు కావడంపై పాఠశాల విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సమయ పాలనలో పలు మార్పులు చేసింది. ప్రాథమిక పాఠశాలలు సాయంత్రం 4 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు సాయంత్రం 4.15 గంటల వరకు పనిచేయనున్నాయి. ఇక హైస్కూళ్లు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని పాఠశాలలు ఉదయం 8.45 నుంచి సాయంత్రం 3.45 వరకు పనిచేస్తాయి.

అలాగే ప్రతి నెలలో 4వ శనివారం నో బ్యాగ్‌ డే అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి రోజూ అరగంట పాఠ్యపుస్తకాలు, కథల పుస్తకాల పఠనం, దినపత్రికలు, మ్యాగ్‌జైన్లను చదివించాలని నిర్ణయించింది. టీశాట్ టీవీ పాఠాలను సైతం ప్రసారం చేయనున్నారు. ఈ విద్యాసంవత్సరంలో జనవరి 10వ తేదీ నాటికి విద్యాబోధన పూర్తి చేయాలని అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి. 

Latest Articles
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్