TG TET 2024 Results: మరికాసేపట్లో తెలంగాణ టెట్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2024) ఫలితాలు బుధవారం (జూన్ 12న) విడుదల కానున్నాయి. ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షలు మే 20న ప్రారంభమైన జూన్ 2వ తేదీతో ముగిశాయి. టెట్ పేపర్-1కు 99,958 మంది, పేపర్-2కు 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో పేపర్-1కు 85,996 మంది, పేపర్-2కు 1,50,491 మంది హాజరయ్యారు. ఇప్పటికే ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్స్‌ను..
హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2024) ఫలితాలు బుధవారం (జూన్ 12న) విడుదల కానున్నాయి. ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షలు మే 20న ప్రారంభమైన జూన్ 2వ తేదీతో ముగిశాయి. టెట్ పేపర్-1కు 99,958 మంది, పేపర్-2కు 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో పేపర్-1కు 85,996 మంది, పేపర్-2కు 1,50,491 మంది హాజరయ్యారు. ఇప్పటికే ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్స్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. పేపర్ల వారీగా కీని అందుబాటులో ఉంచారు. వీటిపై అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తుది కీ సిద్ధం చేసి ఫలితాల ప్రకటనకు ఏర్పాట్లు చేశారు. ఇక ఈరోజు తుది ఫలితాలు విడుదల కానున్నాయి.
తెలంగాణ టెట్ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరిగాయి కాబట్టి మార్కుల కేటాయింపు సాధారణ పద్ధతిలో ఉంటుందా లేదా నార్మలైజేషన్ విధానంలో ఉంటుందా అనేది అధికారులు ఇంకా వెల్లడించలేదు. అలాగే ఈ రోజు ఫలితాలను ఏ సమయంలో విడుదల చేస్తారనేది కూడా వెల్లడించలేదు. ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తు స్వీకరిస్తుంది. ఇంకా ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తుల తుది గడువును జూన్ 20వ తేదీ వరకు పొడిగించారు. ఇక బుధవారం విడుదలయ్యే టెట్ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి కూడా డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ఉద్ధేశ్యంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా డీఎస్సీకి ఇప్పటివరకు దాదాపు 2.35 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు జరగనున్నాయి.
మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.