AP EAPCET 2024 Top Rankers: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో సత్తా చాటిన గుంటూరు విద్యార్ధి.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాలు మంగళవారం (జూన్‌ 11) విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జే శ్యామలరావు ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 3,62,851 మంది విద్యార్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేయగా, వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు..

AP EAPCET 2024 Top Rankers: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో సత్తా చాటిన గుంటూరు విద్యార్ధి.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే
AP EAPCET 2024 Top Rankers
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 12, 2024 | 8:06 AM

అమరావతి, జూన్‌ 12: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాలు మంగళవారం (జూన్‌ 11) విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జే శ్యామలరావు ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 3,62,851 మంది విద్యార్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేయగా, వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో 2,58,373 మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌లలో 80,766 మంది పరీక్షలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 16 నుంచి 23 వరకు ఈఏపీసెట్‌ పరీక్షలు జరిగాయి. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 1,95,092 (75.51 శాతం), అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌లలో 70,352 ( 87.11 శాతం) మంది అర్హత సాధించారు. ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. త్వరలో కౌన్సెలింగ్‌ హెడ్యూల్‌ విడుదల చేయనున్నారు.

ఇంజినీరింగ్ విభాగంలో టాప్‌ 10 ర్యాంకర్లు

  • గుంటూరుకు చెందిన మాకినేని జిష్ణుసాయి 97.0022 మార్కులతో టాప్‌ ర్యాంకు సొంతం చేసుకున్నాడు
  • కర్నూలుకు చెందిన ఎం. సాయి యశ్వంత్‌రెడ్డి 96.8358 మార్కులతో సెకండ్‌ ర్యాంకు పొందాడు
  • ఆదోనికి చెందిన పి.సతీష్‌రెడ్డి 96.4285 మార్కులతో మూడో ర్యాంకు సొంతం చేసుకున్నాడు
  • అనంతపురానికి చెందిన పాలగిరి సతీష్‌రెడ్డి నాలుగో ర్యాంకు
  • గుంటూరుకు చెందిన కోమటినేని మనీశ్‌ చౌదరి ఐదోర్యాంకు
  • తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన ఇప్ప లక్ష్మీనరసింహారెడ్డి ఆరో ర్యాంకు
  • కర్నూలుకు చెందిన గొల్ల లేఖాహర్ష ఏడో ర్యాంకు
  • అనంతపురానికి చెందిన పుట్టి కుశాల్‌కుమార్‌ ఎనిమిదో ర్యాంకు
  • హనుమకొండకు చెందిన పరమారాధ్యులు సుశాంత్‌కు తొమ్మిదో ర్యాంకు
  • ప్రకాశం జిల్లాకు చెందిన కొమిరిశెట్టి ప్రభాస్‌కు పదో ర్యాంకు

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో టాప్‌ 10 ర్యాంకర్లు

  • ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి యెల్లు శ్రీశాంత్‌రెడ్డి సత్తా చాటాడు. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో శ్రీశాంత్‌రెడ్డి ప్రథమ ర్యాంకు సాధించాడు.
  • శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన పూల దివ్య తేజ 92.9278 మార్కులతో సెకండ్‌ ర్యాంకు
  • తిరుపతికి చెందిన వడ్లపూడి ముకేష్‌ చౌదరి థార్డ్ ర్యాంకు
  • చిత్తూరుకు చెందిన పేర సాత్విక్‌ నాలుగో ర్యాంకు
  • అన్నమయ్య జిల్లాకు చెందిన ఆలోర్‌ ప్రణీత ఐదో ర్యాంకు
  • అనంతపూర్‌కు చెందిన గట్టు భానుతేజ సాయి ఆరో ర్యాంకు
  • నిజాంపేటకు చెందిన పెన్నమడ నీహారిక రెడ్డి ఏడో ర్యాంకు
  • విశాఖపట్నంకు చెందిన సంబంగి మానో అభిరామ్‌ ఎనిమిదో ర్యాంకు
  • విశాఖపట్నంకు చెందిన సరగదం పావని తొమ్మిదో ర్యాంకు
  • పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన నాగుదాసరి రాధా కృష్ణ పదో ర్యాంకు సాధించారు

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి