AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎల్పీజీ గ్యాస్‌ కష్టాలు.. ప్రభుత్వ బడి మధ్యాహ్న భోజనంలో అన్నం బదులు పానీపూరీలు! వీడియో

పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల సెగ దేశ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ కొరత దేశమంతా ప్రకంపనలు పుట్టిస్తుంది. ఇప్పటికే పలు ప్రధాన నగరాల్లో హోటళ్ల నుంచి చిరు వ్యాపారుల వరకు ఎల్పీజీ సిలిండర్ల కొరతతో తమ వ్యాపారాలకు గండి పడిందని లబోదిబోమంటున్నారు. ఇక పీజీ హాస్టళ్లు, సంక్షేమ హాస్టళ్ల సంగతి సరేసరి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనంపై కూడా దీని ప్రభావం పడింది..

Viral Video: ఎల్పీజీ గ్యాస్‌ కష్టాలు.. ప్రభుత్వ బడి మధ్యాహ్న భోజనంలో అన్నం బదులు పానీపూరీలు! వీడియో
Bengal School Served Pani Puri In Mid Day Meal
Srilakshmi C
|

Updated on: Mar 16, 2026 | 4:20 PM

Share

పశ్చిమ బెంగాల్‌, మార్చి 16: పశ్చిమ బెంగాల్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎల్పీజీ గ్యాస్‌ కొరత కారణంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అన్నం బదులు పానీపూరీ (గోల్‌గప్పా)లు వడ్డించిన ఘటన సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ వ్యవహారం కాస్తా నెట్టింట సంచలనంగా మారింది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది.

అయితే ఇటీవల కాలంలో కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా స్థానికంగా ఉన్న భద్రకాళి హైస్కూల్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సాధారణంగా విద్యార్థులకు పాఠశాలలోనే గ్యాస్‌ ద్వారా వంట చేసి వడ్డిస్తుంటారు. అయితే ఎల్పీజీ కొరత తలెత్తడంతో సదరు బడిలో వంట చేసే పరిస్థితి కనిపించలేదు. దీంతో విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందించడం వీలు కావడం లేదు. అయితే స్కూల్ టీచర్లు భోజనానికి బదులు విద్యార్ధులకు పానీపూరీలు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోలోను అక్కడి స్కూల్‌ అసిస్టెంట్ టీచర్‌ నందిక సర్కార్‌ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోలోవిద్యార్ధులు కంచాలు పట్టుకుని లైన్‌లో నిలబడి ఉండగా.. వారికి ఎదుట ఓ పానీ పూరీ బండి వ్యాపారి విద్యార్ధుల ప్లేట్లలో పానీ పూరీ వడ్డించడం చూడొచ్చు. ప్రతి విద్యార్ధికి 6-7 పానీ పూరీలు వడ్డిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇక వీడియో వైరల్ కావడంతో అయితే నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఆహారం అందించలేని సందర్భంలో పానీ పూరీ తినడంతో విద్యార్ధుల ముఖంలో సంతోషం కనిపిస్తుంది’, ‘పానీపూరీ ఆరోగ్యకరమైనది కాదు.. సాయంత్రం వేళల్లో దీనిని స్నాక్స్ తీసుకుంటే పర్వాలేదు’, ‘పానీ పూరీలు తింటే ఆకలి తీరదు కదా.. దీంతో విద్యార్ధులకు పోషకాలు అందవు’, ‘LPG గ్యాస్ అందుబాటులో లేనప్పుడు కట్టెలతో వంట చేయాలి కదా?’, ‘పిల్లలకు అనారోగ్యకరమైన ఆహారం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సిలిండర్లు అందించడం వారి పని కాదా?’ .. అంటూ నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. కాగా ఎల్పీజీ గ్యాస్‌ కొరత దేశ వ్యాప్తంగా సాధారణ జీవనంపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ ఘటన ఓ ఉదాహరణగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్