AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పిట్ట భలే తెలివైంది.. పామును ఎట్టా మాయ చేస్తుందో తెలుసా..?

నేల నెమలి తన తెలివైన వ్యూహాలతో ఆశ్చర్యపరుస్తుంది. పాములను గూడు నుంచి దూరం చేసేందుకు రెక్క విరిగినట్లు నటిస్తుంది. గుడ్లను చల్లబరచడం, వాటిని మభ్యపెట్టడం, వర్షాలను సూచించడం, అడవికి వాచ్‌మెన్‌లా కాపలా కాయడం వంటి ప్రత్యేక లక్షణాలతో ఈ పక్షి ప్రకృతిలో అద్భుతమైన మనుగడను సాగిస్తుంది.

ఈ పిట్ట భలే తెలివైంది.. పామును ఎట్టా మాయ చేస్తుందో తెలుసా..?
Red Wattled Lapwing
Ram Naramaneni
|

Updated on: Apr 25, 2026 | 1:49 PM

Share

ప్రకృతిలో అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించే పక్షుల్లో రెడ్ వెటల్డ్ లాప్ వింగ్ (నేల నెమలి) ప్రత్యేక స్థానం సంపాదించింది. తన గూడును, పిల్లలను రక్షించుకోవడంలో ఈ పక్షి అనుసరించే వ్యూహాలు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. గూడు వైపు పాము లేదా వేటగాడు వస్తున్నట్లు గమనించిన వెంటనే, ఈ పక్షి తన రెక్క విరిగినట్లుగా నటిస్తూ దృష్టిని మళ్లిస్తుంది. గాయపడినట్టుగా కనిపిస్తూ వేటగాడిని తన వెంట తీసుకెళ్లి, గూడు నుంచి దూరం చేస్తుంది. ఈ తెలివైన నాటకం వల్ల గుడ్లు, పిల్లలు సురక్షితంగా ఉంటాయి.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ పక్షి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. నీటిలో తన రెక్కలను తడిపి, ఆ తడి రెక్కలతో గుడ్లపై కూర్చుని చల్లదనాన్ని అందిస్తుంది. ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా తాను మారే సామర్థ్యం ఈ పక్షి ప్రత్యేకత.ఇక ఈ పక్షి గుడ్లు రాళ్ల రంగులో ఉండటం వల్ల అవి చుట్టూ ఉన్న నేలతో కలిసిపోయి వేటగాళ్ల కంటికి కనిపించవు. ఇది సహజ రక్షణగా పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఈ పక్షి గూడు పెట్టే ప్రదేశాన్ని బట్టి వర్షపాతం గురించి అంచనాలు వేస్తుంటారు. ఎత్తైన ప్రదేశంలో గూడు పెడితే ఎక్కువ వర్షాలు, లోతట్టు ప్రాంతంలో పెడితే తక్కువ వర్షాలు కురుస్తాయని నమ్మకం. మరో విశేషం ఏమిటంటే, ఈ పక్షి రాత్రి వేళల్లో కూడా అప్రమత్తంగా ఉండి అరుస్తూ తన పరిసరాలకు కాపలా కాస్తుంది. అందుకే దీనిని అడవిలో ‘వాచ్‌మెన్ పక్షి’గా కూడా పిలుస్తారు.

కాగా ఈ పక్షిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. దీన్ని మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్ ద్వారా తెలియజేయండి…

Also Read: గేదె డెలివరీ సమయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి..

Follow Us