- Telugu News Photo Gallery Cricket photos IPL 2026 DC vs PBKS Highlights: Punjab Kings Script History with Record Run Chase
PBKS Vs DC: 33 సిక్సర్లు, 47 ఫోర్లతో ఊహకందని ఊచకోత.! వెంట్రుక పీకలేరంటూ సర్పంచ్ సాబ్ ఊదిపడేశాడుగా
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ 264 పరుగులు చేసినా, పంజాబ్ కింగ్స్ ఆ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి చరిత్ర సృష్టించింది. కేఎల్ రాహుల్ 152 పరుగులు చేసినప్పటికీ, పంజాబ్ బ్యాటర్ల సమిష్టి పోరాటంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్‌గా రికార్డులకు ఎక్కింది.
Updated on: Apr 25, 2026 | 8:36 PM

ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 67 బంతుల్లో 152 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 16 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. మైదానం నలుమూలల క్లాసిక్ షాట్లతో విరుచుకుపడుతూ ఢిల్లీకి రికార్డు స్థాయి స్కోరును అందించాడు రాహుల్.

ఢిల్లీ భారీ స్కోరు సాధించడంలో నితీష్ రాణా పోషించిన పాత్ర మరువలేనిది. 91 పరుగులతో రాహుల్‌కు అండగా నిలిచి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి మధ్య కుదిరిన భాగస్వామ్యం పంజాబ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. రాణా ఈ ఇన్నింగ్స్‌లో తన మార్క్ షాట్లతో అభిమానులను అలరించడమే కాకుండా, ఢిల్లీ స్కోరు 260 దాటడంలో కీలకపాత్ర పోషించాడు. అతని బ్యాటింగ్ పవర్ ప్లే తర్వాత మ్యాచ్‌పై పట్టు తెచ్చింది.

265 పరుగుల ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్. కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి, అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేసే దిశగా జట్టును నడిపించాడు. అతని దూకుడు చూసి ఢిల్లీ బౌలర్లు ఒక్కసారిగా ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. ఈ మెరుపు ఆరంభమే పంజాబ్ చరిత్ర సృష్టించడానికి పునాది వేసింది.

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్. 36 బంతుల్లో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. వికెట్లు పడుతున్నా ఏమాత్రం తొండర పాటు చెందకుండా, క్రీజులో పాతుకుపోయి మ్యాచ్‌ను ఫినిష్ చేసిన తీరు అద్భుతం. అతని నాయకత్వ లక్షణాలు, బ్యాటింగ్ ప్రతిభ ఈ చారిత్రాత్మక విజయానికి ప్రధాన కారణం. క్లిష్ట సమయంలో ఒత్తిడిని జయించి పంజాబ్ అభిమానుల కళ్ళలో ఆనందాన్ని నింపాడు అయ్యర్.

చివరి బంతికి వైడ్ రావడంతో పంజాబ్ విజయం ఖరారైంది. 265 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని సాధ్యం చేసి పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు మైదానంలో సంబరాలు చేసుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. 265 పరుగుల లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా మిగిలిపోతుంది. ఢిల్లీ మైదానంలో పంజాబ్ కింగ్స్ సృష్టించిన ఈ సునామీ రికార్డులను తిరగరాయడమే కాకుండా, ఐపీఎల్ 2026 సీజన్‌లో వారిని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపింది. ఇక ఇప్పటిదాకా ఆడిన 7 మ్యాచ్‌లలోనూ 6 విజయాలు సాధించి 13 పాయింట్లతో టాప్ స్థానంలో కొనసాగుతోంది పంజాబ్ కింగ్స్.
