ఒడిశాలోని మయూర్ బంజ్ జిల్లాలో విష సర్పం బారి నుంచి 30 మంది కిండర్ గార్డెన్ పిల్లలను కాపాడే క్రమంలో వీధి కుక్క కాళి ప్రాణాలు త్యాగం చేసింది. స్కూలు బయట ఆడుకుంటున్న చిన్నారులను రక్షించేందుకు పాముతో పోరాడి, దానిని అంతమొందించినప్పటికీ, పాము కాట్లతో కాళి మరణించింది. గ్రామస్తులు కాళికి గౌరవపూర్వక అంత్యక్రియలు నిర్వహించారు.