Walnuts Benefits: వాల్నట్స్ను "బ్రెయిన్ ఫుడ్" అంటారు. వీటిలోని పోషకాలు జ్ఞాపకశక్తిని పెంచి, మెదడు కణాలను రక్షిస్తాయి. ఒమేగా-3, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు గుండె, జీర్ణవ్యవస్థ, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. మధుమేహం నియంత్రణ, నిద్రలేమి, జుట్టు రాలే సమస్యల నివారణకు వాల్నట్స్ అద్భుతమైనవి. నానబెట్టి తినడం వల్ల పోషకాలు మరింత సమర్థవంతంగా శరీరానికి అందుతాయి.