ఆ ఉగ్ర నేతను పట్టిస్తే రూ.94 కోట్లు..
ఇరాక్‌లోని ఇరాన్ మద్దతుగల కతాయెబ్ సయ్యద్ అల్-షుహదా (KSS) మిలీషియా నాయకుడు హషీమ్ వాయెలీని పట్టిస్తే అమెరికా $10 మిలియన్ల భారీ నజరానా ప్రకటించింది. ఇరాక్, సిరియాలోని అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకు వాయెలీ కారణమని ఆరోపించింది. ఇతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించబడ్డాడు. సమాచారం ఇచ్చిన వారికి రక్షణ, అవసరమైతే పునరావాసం కల్పిస్తామని అమెరికా హామీ ఇచ్చింది.
ఇరాక్‌లో ఇరాన్ మద్దతున్న ఓ మిలీషియా నాయకుడిని పట్టిస్తే.. భారీ నజరానా ఇస్తామని అమెరికా ప్రకటించింది. కతాయెబ్ అనే ఉగ్ర సంస్థకు నాయకుడు హషీమ్ వాయెలీని అరెస్ట్ చేయడానికి సమాచారం అందిస్తే 10 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 94 కోట్లు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది. ఇరాక్, సిరియాలో .. అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకు వాయెలీ గ్రూప్ దే బాధ్యత అని అమెరికా ఆరోపించింది. సమాచారం ఇచ్చిన వారికి పూర్తి రక్షణ, అవసరమైతే పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేసింది. ఇరాక్‌లో ఇరాన్ అనుకూల మిలీషియాలపై ఒత్తిడి పెంచి, వాటిని కట్టడి చేసే కొత్త ప్రధాని నియామకాన్ని ప్రోత్సహించే వ్యూహం అమలు చేస్తున్నారు ట్రంప్. అబూ వాయెలీ కేఎస్ఎస్ గ్రూప్‌లో చేరకముందు కతాయెబ్ అనే మరో అమెరికా వ్యతిరేక షియా మిలీషియాలో సభ్యుడిగా ఉండేవాడు. ఆ సమయంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు అమెరికా దళాలకు పట్టుబడి 2010లో విడుదలయ్యాడు. ఆ తర్వాత సిరియా అంతర్యుద్ధం సమయంలో కేఎస్ఎస్ గ్రూప్‌లో చేరాడు. వాయెలీ నాయకత్వం వహిస్తున్న కేఎస్ఎస్ సంస్థ, ఇరాన్ ఇస్లామిక్ కార్ప్స్ IRGC భావజాలంతో పని చేస్తుంది. ఈ సంస్థ యెమెన్‌లోని హౌతీలకు మద్దతు ప్రకటించింది. విచిత్రమేమిటంటే, కేఎస్ఎస్ ఫైటర్లు ఇరాక్ అధికారిక భద్రతా దళాల్లోని 14వ బ్రిగేడ్‌గా కూడా కొనసాగుతున్నారు. కేఎస్ఎస్ కార్యకలాపాలను గమనించిన అమెరికా, 2023 నవంబర్ 17న వాయెలీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. గడిచిన దశాబ్ద కాలంలో ఈ గ్రూపు అమెరికా దళాలపై 1,000కి పైగా దాడులు చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పక్కింటి వారి వల్ల నిద్ర కరువైంది.. అమెరికాలో ఇండియన్ ఫ్యామిలీ పై ఫిర్యాదు
చోరీ అయిన ఫోన్.. డిటెక్టివ్‌గా మారి దొంగను పట్టుకున్న వ్యక్తి..
ఏపీలో కొత్తగా 1.5 లక్షల పింఛన్లు !! దరఖాస్తులు తీసుకునేది ఎప్పటి నుంచి అంటే…?
చోరీ అయిన ఫోన్.. డిటెక్టివ్‌గా మారి దొంగను పట్టుకున్న వ్యక్తి..
ఆ జలసంధిలో.. 124 నౌకల శకలాలు
దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా
అన్నం పెట్టిన చేతిని మరువని శునకాలు.. మహిళ హత్య గుట్టు రట్టు
మోమోస్ తిన్న బాలికకులివర్ డ్యామేజ్.. చివరకు..!
కస్టమర్ కు రూ.3.21 లక్షల.. పరిహారాన్ని చెల్లించిన బ్యాంక్ !!
ముక్కు పుడకతో పరీక్ష హాలుకెళ్లిన విద్యార్థిని.. కట్ చేస్తే

