ఆ జలసంధిలో.. 124 నౌకల శకలాలు
జిబ్రాల్టర్ జలసంధిలో శాస్త్రవేత్తలు 124 నౌకల శకలాలను గుర్తించారు. యూరోప్, ఆఫ్రికాను వేరుచేసే ఈ ముఖ్యమైన జలమార్గంలో ప్యూనిక్, రోమన్, మధ్యయుగాల నాటి నౌకలతో పాటు రెండో ప్రపంచ యుద్ధ సబ్‌మెరైన్ కూడా ఉన్నాయి. స్పెయిన్ పురావస్తు శాస్త్రవేత్తలు చేసిన ఈ ఆవిష్కరణ సముద్ర చరిత్రపై కొత్త వెలుగును ప్రసరిస్తుంది. అంతర్జాతీయ సరకు రవాణాలో జిబ్రాల్టర్ ప్రాముఖ్యతను ఇది మరోసారి గుర్తుచేస్తుంది. లోతైన అధ్యయనాలకు ఇంకా ఆస్కారం ఉంది.
సరుకు రవాణాలో జలసంధి పాత్ర ఎంత ముఖ్యమో హర్మూజ్‌తో మనకు తెలిసొచ్చింది. అలాంటి మరో జలసంధికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. యూరోప్, ఆఫ్రికాను వేరు చేసే ‘జిబ్రాల్టర్ జలసంధి లో ఒక చోట శాస్త్రవేత్తలు 124 నౌకల శకలాలను గుర్తించారు. స్పెయిన్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఆ అధ్యయనం చేశారు. నీటి అడుగున పురావస్తు ప్రాంతాలకు వెళ్లారు. జిబ్రాల్టర్ జలసంధిలోని 29 స్క్వేర్‌మైల్ బే వద్ద 124 నౌకల శకలాలను గుర్తించారు. అందులో అతిపురాతన ప్యూనిక్ నాగరికత, రోమన్, మధ్యయుగం నాటి నౌకల శకలాలు కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తమ రీసెర్చ్ పేపర్‌లో తెలిపారు. అందులో 5వ శతాబ్దం నాటి నౌక కూడా ఉన్నట్లు గుర్తించారు . అప్పట్లో ఆ నౌకలో స్పెయిన్‌లో తయారుచేసిన చేపల సాస్‌ను రవాణా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. రెండో ప్రపంచయుద్ధంలో ఇటలీ నౌక ఉపయోగించిన ఓ సబ్‌మెరైన్ శకలాన్ని కూడా గుర్తించారు. ఆ బృందం నీటి లోపల కేవలం 10 మీటర్ల లోతు వరకే అధ్యయనం చేసిందట. ఆ ప్రాంతం మొత్తం లోతు దాదాపు 400 మీటర్లు ఉంటుందని, ఇంకా లోపలికి వెళ్తే మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హర్మూజ్ లాగానే ‘జిబ్రాల్టర్’ 36 మైళ్ల పొడవుండే సన్నని పొడవైన జలసంధి. ఈ జలమార్గం అట్లాంటిక్ మహా సముద్రం, మధ్యధరా సముద్రాన్ని కలుపుతుంది. ఈ జలసంధి ఒక ప్రాంతంలో కేవలం 8 మైళ్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అంతర్జాతీయ సరకు రవాణాలో ఇది ప్రధాన జలమార్గం. రోజుకు సగటున 300 నౌకలు జిబ్రాల్టర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీలో కొత్తగా 1.5 లక్షల పింఛన్లు !! దరఖాస్తులు తీసుకునేది ఎప్పటి నుంచి అంటే…?
దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా
ఆ జిల్లాల్లో బయట కాలు పెడితే అంతే !! అధికారుల సీరియస్ వార్నింగ్
అన్నం పెట్టిన చేతిని మరువని శునకాలు.. మహిళ హత్య గుట్టు రట్టు
చోరీ అయిన ఫోన్.. డిటెక్టివ్‌గా మారి దొంగను పట్టుకున్న వ్యక్తి..
ఆ జలసంధిలో.. 124 నౌకల శకలాలు
దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా
అన్నం పెట్టిన చేతిని మరువని శునకాలు.. మహిళ హత్య గుట్టు రట్టు
మోమోస్ తిన్న బాలికకులివర్ డ్యామేజ్.. చివరకు..!
కస్టమర్ కు రూ.3.21 లక్షల.. పరిహారాన్ని చెల్లించిన బ్యాంక్ !!
ముక్కు పుడకతో పరీక్ష హాలుకెళ్లిన విద్యార్థిని.. కట్ చేస్తే

