AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం పెట్టిన చేతిని మరువని శునకాలు.. మహిళ హత్య గుట్టు రట్టు

అన్నం పెట్టిన చేతిని మరువని శునకాలు.. మహిళ హత్య గుట్టు రట్టు

Phani CH
|

Updated on: Apr 25, 2026 | 10:56 AM

Share

హర్యానా ఫరీదాబాద్‌లో ఒక దారుణ హత్య వెలుగు చూసింది. అత్తమామలు హత్య చేసిన వివాహిత మృతదేహాన్ని వీధి కుక్కలు గుర్తించడంలో పోలీసులకు సహకరించాయి. యజమానురాలికి అన్నం పెట్టిన ఆ వీధి కుక్కలు, ఆమె హత్యకు గురై పూడ్చిపెట్టిన చోట నిరంతరం మొరుగుతూ స్థానికుల, పోలీసుల దృష్టిని ఆకర్షించాయి. వాటి సూచనతో మృతదేహం బయటపడింది, నిందితులైన అత్తమామలు అరెస్ట్ అయ్యారు. మూగజీవాల విశ్వసనీయతకు ఇదొక గొప్ప నిదర్శనం.

విశ్వాసానికి మారుపేరుగా నిలిచే మూగజీవాలు, అన్నం పెట్టిన చేతికి ఆపద వస్తే ఊరుకోవని హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌ లో జరిగిన ఘటన నిరూపించింది. తమను అల్లారుముద్దుగా చూసుకున్న యజమానురాలు కిరాతకుల చేతిలో హత్యకు గురైతే.. ఆ వీధి కుక్కలు మౌనంగా ఉండలేకపోయాయి. ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టిన చోట నిరంతరం మొరుగుతూ, పోలీసులకు నిందితులరె పట్టించడంలో కీలక పాత్ర పోషించాయి. కన్నవారే కాలయములై ఒక ప్రాణాన్ని తీస్తే, ఆ మూగజీవాలు ఆమెకు న్యాయం జరిగేలా మృత్యుంజయులై నిలిచాయి. ఫరీదాబాద్‌కు చెందిన ఓ వివాహిత గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయింది. ఆమె అత్తమామలు మాత్రం ఆమె ఎవరితోనో లేచిపోయిందని గ్రామస్థులను నమ్మబలికారు. అయితే, మృతురాలికి రోజూ వీధి కుక్కలకు అన్నం పెట్టే అలవాటు ఉంది. ఆమె కనిపించకుండా పోయినప్పటి నుంచి, ఆ ప్రాంతంలోని కుక్కలు ఒక నిర్దిష్ట ప్రదేశానికి వెళ్లి నిరంతరం మొరుగుతూ ఉండటాన్ని స్థానికులు గమనించారు. మృతురాలి ఇంటి సమీపంలో కొత్తగా వేసిన కాంక్రీట్ రోడ్డు, ఖాళీ ప్రదేశం వద్ద కుక్కలు వింతగా ప్రవర్తిస్తుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. కుక్కలు సూచించిన చోట తవ్వగా.. సుమారు 10 అడుగుల లోతులో పాతిపెట్టిన మహిళ మృతదేహం బయటపడింది. వరకట్న వేధింపులు, కుటుంబ తగాదాల వల్ల అత్తమామలే ఆమెను హత్య చేసి, ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి ముందే గొయ్యి తీసి పాతిపెట్టారు. ఆ తర్వాత ఆ ప్రదేశంపై కాంక్రీట్ వేసి ఏమీ ఎరగనట్లుగా డ్రామా ఆడారు. మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు ఆమె భర్త, మామ, అత్తను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. తమకు అన్నంపెట్టి ఆదరించిన మహిళ ఇక లేదని తెలిసి, ఆ మూగజీవాలు చూపిన చొరవ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మోమోస్‌ తిన్న బాలికకులివర్‌ డ్యామేజ్.. చివరకు..!

ఆటో డెబిట్ చెల్లింపులపై.. ఆర్‌బీఐ కొత్త రూల్‌

ముక్కు పుడకతో పరీక్ష హాలుకెళ్లిన విద్యార్థిని.. సిబ్బంది ఏం చేసారంటే

35 ఏళ్ల కిందట ల్యాండ్ అయింది.. ఇప్పటికీ అక్కడే..!

Ajith: ఓటేసి నోరు జారిన అజిత్.. విజయ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. దెబ్బకి వివరణ

Follow Us