AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith: ఓటేసి నోరు జారిన అజిత్.. విజయ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. దెబ్బకి వివరణ

Ajith: ఓటేసి నోరు జారిన అజిత్.. విజయ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. దెబ్బకి వివరణ

Phani CH
|

Updated on: Apr 25, 2026 | 10:29 AM

Share

తమిళ స్టార్ హీరో అజిత్ ఓటింగ్ సందర్భంగా 'నో నెవర్' అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కోలీవుడ్ మీడియా, విజయ్ అభిమానులు వీటిని తప్పుగా అర్థం చేసుకుని అజిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో మార్పు అవసరం లేదని అజిత్ చెప్పాడని ప్రచారం చేయడంతో ట్రోలింగ్ తీవ్రమైంది. అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర వివరణ ఇస్తూ, అజిత్ వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని, ఆయన 'ఇప్పుడు వద్దు' అనే ఉద్దేశ్యంతోనే మాట్లాడారని స్పష్టం చేశారు.

తమిళనాట స్టార్ హీరో అజిత్ మరో సారి చిక్కుల్లో పడ్డాడు. నోరు జారి ఓ మాటని.. విజయ్ తలపతి ఫ్యాన్స్‌కు టార్గెట్ అయ్యాడు. వారి నుంచి వస్తున్న విమర్శల ధాటికి వివరణ కూడా ఇచ్చుకున్నాడు. ఓట్లు వేసిన సెలబ్రటీలు అందరూ మీడియా ముందుకు వచ్చి ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చే విధంగా మాట్లాడుతుంటారు. ఓటు వేయడం బాధ్యతని.. అందరూ సంబంధిత పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలంటూ చెబుతుంటారు. అయితే అజిత్ మాత్రం.. ఇలా చెప్పకపోగా.. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చి చిక్కుల్లో పడ్డాడు. ఓటు వేసి బటయటికి వచ్చిన అజిత్‌ను.. రిపోర్టర్లు చుట్టుముట్టారు. అయితే అందులో ఓ రిపోర్టర్ ‘తమిళనాడులో మార్పు తథ్యమా..?’ అని అజిత్‌ను ప్రశ్నించాడు. అందుకు బదులుగా హీరో అజిత్.. ‘నో నెవర్‌’ అని వ్యాఖ్యలు చేసి వెళ్లి పోయారు. అయితే ఈయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న కోలీవుడ్ మీడియా… తమిళానాడులో మార్పు అవశ్యం లేదంటూ.. అజిత్ ఇదే చెప్పారంటూ.. ప్రచారం చేసింది. ఇదే విజయ్‌ అభిమానుల్లో ఆగ్రహానికి కారణం అయింది. అయితే ఇదంతా గమనిస్తూ ఉన్న అజిత్‌ .. తన మేనేజర్‌ సురేష్‌ చంద్ర ద్వారా వివరణ ఇచ్చారు. నో నెవర్‌ అని అజిత్‌ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని, ఇప్పుడు వద్దు అని వారిస్తూ ఆంగ్లంలో చేసిన వ్యాఖ్యలు మరో విధంగా అర్థానికి దారి తీసినట్టు ప్రకటించారు. మరి ఇప్పుడైనా.. విజయ్‌ ఫ్యాన్స్ అజిత్‌ను విమర్శించడం.. ట్రోల్ చేయడం ఆపుతారో లేదో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trisha: ఏదోటి క్రేజీగా చేయకుండా.. ఈమె ఉండదుగా..

TOP 9 ET: ఇంటర్నేషల్‌ వేదికపై ‘వారణాసి’ రిలీజ్‌ !! AA23 రేంజ్‌ ఊహించలేరు..

Follow Us