AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆటో డెబిట్ చెల్లింపులపై.. ఆర్‌బీఐ కొత్త రూల్‌

ఆటో డెబిట్ చెల్లింపులపై.. ఆర్‌బీఐ కొత్త రూల్‌

Phani CH
|

Updated on: Apr 25, 2026 | 10:53 AM

Share

డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేసేందుకు RBI కొత్త నిబంధనలు తెచ్చింది. పాత కార్డుపై ఉన్న ఈ-మాండేట్‌లు కొత్త కార్డుకు ఆటోమేటిక్‌గా బదిలీ అవుతాయి. నెలకు ₹15 వేల వరకు ఆటోమేటిక్ చెల్లింపులకు OTP అవసరం లేదు. ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డు బిల్లుల ₹1 లక్ష వరకు OTP లేకుండా చెల్లించవచ్చు. ఇది వినియోగదారులకు మరింత సులభతరం, సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను అందిస్తుంది.

డిజిటల్ చెల్లింపులు ఇటీవల పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటంతో నెట్, మొబైల్ బ్యాంకింగ్‌తో పాటు యూపీఐ సౌకర్యాన్ని ఎక్కువమంది ఉపయోగించుకుంటున్నారు. ఈ విధానాల ద్వారా డిజిటల్ విధానంలో చెల్లింపులు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులను మరింత వేగవంతం చేసేందుకు RBI కొత్త రూల్స్‌ ప్రవేశపెట్టింది. ఆటోమేటిక్ ఇ-మాండేట్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇక నుంచి కొత్త కార్డు పొందినప్పుడు పాత కార్డుపై ఉన్న ఇ- మాండేట్ చెల్లింపులు కొత్త కార్డుకు ఆటోమేటిక్‌గా బదిలీ అవుతాయి. ఇ-మాండేట్ చెల్లింపులను సులభతరం చేయడం, సురక్షితంగా కస్టమర్లు నిర్వహించేందుకు ఆర్బీఐ ఈ రూల్స్ ప్రవేశపెట్టింది. కంపెనీలు, వ్యక్తుల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా ఇ-మాండేట్ నిబంధనల్లో ఆర్బీఐ మార్పులు చేసింది. అలాగే ఆటోమేటెడ్ చెల్లింపులపై ఆర్బీఐ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇప్పటివరకు పేమెంట్స్ కోసం ఓటీపీ ఎంటర్ చేయాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి నెలకు రూ.15 వేల వరకు జరిగే ఆటోమేటిక్ చెల్లింపులకు ఎలాంటి ఓటీపీ, పాస్ వర్డ్ అవసరం లేదని ఆర్బీఐ తెలిపింది. ఇంతకంటే ఎక్కువ పేమెంట్స్‌కు మాత్రమే ఓటీపీ లేదా పాస్ వర్డ్ ధృవీకరణ అవసరమవుతుందని స్పష్టం చేసింది. ఇక ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, కరెంట్ బిల్లుల చెల్లింపుల కోసం ఇ-మాండేట్‌ ఎంచుకున్న వినియోగదారుల నుంచి ఎలాంటి సర్వీస్ ఛార్జీలు రుసుములు వసూలు చేయవద్దని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఇక ఇ-మాండేట్‌ ట్రన్సాక్షన్లకు సంబంధించి కస్టమర్ల సమస్యలను పరిష్కరించేందుకు పటిష్టమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకులను ఆదేశించింది. ఇక ఇన్యూరెన్స్ ప్రీమియంలు, మ్యూచవల్ ఫండ్స్ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులకు ఓటీపీ లేకుండా రూ.లక్ష వరకు ట్రాన్సాక్షన్ చేయవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీలను మరింత వేగంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయాలు ఉపయోగపడనున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముక్కు పుడకతో పరీక్ష హాలుకెళ్లిన విద్యార్థిని.. సిబ్బంది ఏం చేసారంటే

35 ఏళ్ల కిందట ల్యాండ్ అయింది.. ఇప్పటికీ అక్కడే..!

Ajith: ఓటేసి నోరు జారిన అజిత్.. విజయ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. దెబ్బకి వివరణ

Trisha: ఏదోటి క్రేజీగా చేయకుండా.. ఈమె ఉండదుగా..

TOP 9 ET: ఇంటర్నేషల్‌ వేదికపై ‘వారణాసి’ రిలీజ్‌ !! AA23 రేంజ్‌ ఊహించలేరు..

Follow Us