35 ఏళ్ల కిందట ల్యాండ్ అయింది.. ఇప్పటికీ అక్కడే..!
35 ఏళ్ల క్రితం ఇంజిన్ లోపంతో నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన బోయింగ్ 720 విమానం అక్కడే వదిలేశారు. రన్‌వేకి అడ్డంకిగా మారడంతో, డీజీసీఏ హెచ్చరికల తర్వాత అధికారులు దానిని తొలగించారు. పార్కింగ్ ఛార్జీలు రూ.7 కోట్లకు చేరగా, ప్రస్తుతం విమానం శిథిలావస్థలో ఉంది. ఒకప్పుడు అమెరికా, యూరప్‌లలో సేవలందించి, ఇప్పుడు భారతదేశంలో మిగిలి ఉన్న ఏకైక బోయింగ్ 720 ఇది.
35 ఏళ్ల క్రితం ఒక బోయింగ్ 720 విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాధారణంగా కొన్ని రోజుల్లోనే మరమ్మతులు పూర్తిచేసుకుని విమానాలు వెళ్లిపోతాయి. కానీ, ఈ విమానం కథ వేరు. అది ల్యాండ్ అయిన నాటి నుంచి మళ్లీ గాల్లోకి ఎగరలేదు. దశాబ్దాలుగా రన్‌వే పక్కనే దుమ్ముకొట్టుకుపోయి నిలిచిపోయింది. ఈ విమానాన్ని రన్‌వే నుంచి 90 మీటర్ల దూరంలోకి జరిపారు. అయితే, రన్‌వేకు కనీసం 150 మీటర్ల దూరంలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. దీంతో ఏళ్ల తరబడి నాగ్‌పూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ప్రతి విమానం ఒక ప్రమాదకర జోన్‌లో ప్రయాణించాల్సి వచ్చింది. ల్యాండింగ్ సమయంలో విమానాలు కొన్నిసార్లు అదుపుతప్పే అవకాశం ఉంటుంది. పక్కన ఇలాంటి విమానం ఉంటే అది పెను ప్రమాదానికి దారితీయొచ్చు. విమానం యజమానికి, విమానాశ్రయ అధికారులకు మధ్య వివాదం కారణంగానే 35 సంవత్సరాలుగా విమానాన్ని తొలగించలేదు. అయితే, అత్యవసర ల్యాండింగ్ తర్వాత యజమానులు విమానాన్ని వదిలేశారని విమానాశ్రయ అధికారులు వాదించారు. దాంతో పార్కింగ్ ఛార్జీలు పేరుకుపోయి సుమారు రూ.7 కోట్లకు చేరాయి. డీజీసీఏ విమానాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తూ వచ్చింది. కానీ, ప్రతీసారి గడువు పొడిగిస్తూ పోయారు. చివరికి, నిబంధనలు పాటించకపోతే విమానాశ్రయం లైసెన్స్‌ను రద్దు చేస్తామని డీజీసీఏ ఫైనల్ హెచ్చరిక జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. అప్పటికే విమానం టైర్లు పాడైపోయి, నిర్మాణం బలహీనపడింది. ఎయిర్ ఇండియా నిపుణులు రంగంలోకి దిగి, చక్రాలను మార్చి టోయింగ్ చేసేందుకు సిద్ధం చేశారు. కేవలం గంట వ్యవధిలో విమానాన్ని 600 మీటర్ల దూరానికి విజయవంతంగా తరలించారు. విమానాన్ని రెస్టారెంట్‌గా, మ్యూజియంగా మార్చాలనే పలు ప్రతిపాదనలు వచ్చినా ఏవీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఈ బోయింగ్ 720 విమానం నాగ్‌పూర్ ఫ్లయింగ్ క్లబ్‌లో శిథిలావస్థలో ఉంది. పునరుద్ధరించడానికి వీలులేనంతగా దెబ్బతింది. ఒకప్పుడు అమెరికా, యూరప్‌లో సేవలందించిన విమానం, మన దేశంలో మిగిలి ఉన్న ఒకే ఒక్క బోయింగ్ 720గా నేడు దర్శనమిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ajith: ఓటేసి నోరు జారిన అజిత్.. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం.. దెబ్బకి వివరణ
Trisha: ఏదోటి క్రేజీగా చేయకుండా.. ఈమె ఉండదుగా..
TOP 9 ET: ఇంటర్నేషల్ వేదికపై ‘వారణాసి’ రిలీజ్ !! AA23 రేంజ్ ఊహించలేరు..
ముక్కు పుడకతో పరీక్ష హాలుకెళ్లిన విద్యార్థిని.. కట్ చేస్తే
35 ఏళ్ల కిందట ల్యాండ్ అయింది.. ఇప్పటికీ అక్కడే..!
ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!
మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన

