మోమోస్ తిన్న బాలికకులివర్ డ్యామేజ్.. చివరకు..!
ఆధునిక జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ అంతర్భాగం అయినప్పటికీ, వాటి వల్ల ఆరోగ్య ప్రమాదాలెక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచుగా మోమోస్ తినడం వల్ల ఢిల్లీలోని ఓ చిన్నారి కాలేయం దెబ్బతిని ప్రాణాపాయం నుంచి బయటపడింది. దేశంలో 35% మంది పిల్లల్లో ఫ్యాటీ లివర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్లాస్మాఫెరెసిస్ చికిత్సతో బాలిక కోలుకుంది. ఇటువంటి ఘటనలు ఫాస్ట్ ఫుడ్ పై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి.
ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, ఆధునిక జీవనశైలిలో అంతర్భాగం, వాటి వల్ల ఆరోగ్య ప్రమాదాలెక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి ఎంత ప్రమాదకరమో హెచ్చరించే ఒక హృదయ విదారక ఘటన ఢిల్లీలోని బురారీలో జరిగింది. వేడిగా వెజ్, నాజ్ వెజ్ మోమోస్ తినడం చాలా మందికి ప్రాణం. కానీ నిత్యం మోమోస్ తినడం వల్ల 10 ఏళ్ల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురై తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఢిల్లీలోని బురారీకి చెందిన తాన్య తల్లి సావిత్రి కేర్‌టేకర్. తండ్రి కిషోర్ మొబైల్ టెక్నీషియన్. తల్లిదండ్రులు ఇద్దరూ డ్యూటీకి ళ్లిన సమయంలో, తాన్య తన తాత దగ్గర డబ్బులు తీసుకుని రోజూ బయట మోమోస్, చిప్స్ వంటివి కొని తినేది. చిన్నారి తాన్యకు జ్ఞాపకశక్తి తగ్గడంతో సమస్య మొదలైంది. చిన్న చిన్న విషయాలను మర్చిపోవడం ఏగాగ్రత తగ్గడం వల్లే అనుకున్నారు. నీరసం, అలసటతో బాధపడేది. చివరికి నడవలేని స్థితికి చేరుకుంది. వైద్య పరీక్షలలో ఆమె కాలేయం దెబ్బతిన్నట్లు తేలింది. ఆమె శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి, మెదడు వాచింది, దీంతో ఆమెను ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. మోమోస్ తరచుగా తినడమే ఆమె పరిస్థితికి కారణమని వైద్యులు నిర్ధారించారు. వైద్యులు మొదట ఆ బాలికకు కాలేయ మార్పిడి చేయాలని అనుకున్నారు. కానీ ప్లాస్మాఫెరెసిస్ చికిత్సతో ఆమె పరిస్థితి మెరుగుపడింది. శరీరంలోని రక్తం నుంచి విషపూరితమైన ప్లాస్మాను తొలగించి, దాని స్థానంలో శుభ్రమైన ప్లాస్మాను ఎక్కించే ప్రక్రియ నిర్వహించారు. దీనివల్ల కాలేయంపై ఒత్తిడి తగ్గి, అది కోలుకోవడానికి అవకాశం కలిగింది. రెండు యూనిట్ల ప్లాస్మా సహాయంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. దేశంలో దాదాపు 35 శాతం మంది పిల్లల్లో ఫ్యాటీ లివర్ లక్షణాలు బయటపడ్డాయనే తాజా సర్వే ఫలితాలు ఆందోళన కలిగించే విషయం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆటో డెబిట్ చెల్లింపులపై.. ఆర్‌బీఐ కొత్త రూల్
ముక్కు పుడకతో పరీక్ష హాలుకెళ్లిన విద్యార్థిని.. సిబ్బంది ఏం చేసారంటే
35 ఏళ్ల కిందట ల్యాండ్ అయింది.. ఇప్పటికీ అక్కడే..!
Ajith: ఓటేసి నోరు జారిన అజిత్.. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం.. దెబ్బకి వివరణ
చోరీ అయిన ఫోన్.. డిటెక్టివ్‌గా మారి దొంగను పట్టుకున్న వ్యక్తి..
ఆ జలసంధిలో.. 124 నౌకల శకలాలు
దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా
అన్నం పెట్టిన చేతిని మరువని శునకాలు.. మహిళ హత్య గుట్టు రట్టు
మోమోస్ తిన్న బాలికకులివర్ డ్యామేజ్.. చివరకు..!
కస్టమర్ కు రూ.3.21 లక్షల.. పరిహారాన్ని చెల్లించిన బ్యాంక్ !!
ముక్కు పుడకతో పరీక్ష హాలుకెళ్లిన విద్యార్థిని.. కట్ చేస్తే

