ఓటు వేయడం కేవలం రాజకీయ ప్రక్రియ మాత్రమే కాదు, అది మీ ఆరోగ్యాన్ని, ఆయుష్షును ప్రభావితం చేస్తుందని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. ఓటు వేసే వృద్ధులు ఎక్కువ కాలం జీవిస్తున్నారని న్యూ ఢిల్లీ పరిశోధకులు గుర్తించారు. సామాజిక నిబద్ధత శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడి దీర్ఘాయుష్షును పెంచుతుందని ఈ అధ్యయనం తేల్చింది.