AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రోన్ తో విత్తనాలు నాటే ప్రక్రియ.. నువ్వులు సాగు చేస్తూ భళా అనిపించుకుంటున్న ఆదిలాబాద్ రైతు

అభివృద్దికి ఆమడదూరంలో నిలిచిన అడవుల జిల్లా ఇప్పుడు శాస్త్రసాంకేతికతను అంది పుచ్చుకుని ముందుకు సాగేందుకు సిద్దమవుతోంది. పాత పద్దతులకు పాతరేసి నయా టెక్నాలజీని అందిపుచ్చుకుని సాగులో సత్తా చాటాలని భావిస్తోంది. మారుమూల జిల్లాగా ఉన్న మనం మారుతున్న కాలంతో పాటే మారాకపోతే ఆగం అవుతామంటోంది. సాగులో వస్తున్న విప్లవాత్మక మార్పులతో.. అభివృద్ది చెందిన శాస్త్రసాంకేతికను అందిపుచ్చుకొని అన్ని రంగాలలోనూ ముందుగు సాగుతామంటోంది. తాజాగా వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను అందిపుచ్చుకుని అధిక దిగుబడులను సాధించేందుకు మేము సైతం అంటూ ముందుకొస్తోంది జిల్లా రైతాంగం. తాజాగా డ్రోన్ ల సాయంతో విత్తనాలు విత్తు‌తు సమయాన్ని ఆదా చేసుకోవడమే కాదు.. కూలీల కొరతను సైతం అదిగమిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. శాస్త్రవేత్తల కృషితో డ్రోన్ లతో నువ్వుల‌ సాగు చేస్తున్న ఆదిలాబాద్ రైతులపై టీవి9 స్పెషల్ రిపోర్ట్.

డ్రోన్ తో విత్తనాలు నాటే ప్రక్రియ.. నువ్వులు సాగు చేస్తూ భళా అనిపించుకుంటున్న ఆదిలాబాద్ రైతు
Drone Farming
Naresh Gollana
| Edited By: |

Updated on: Mar 16, 2026 | 1:45 PM

Share

ఆదిలాబాద్ జిల్లా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆదివాసీలు.. అమాయకత్వం. ఇక ఈ జిల్లా రైతులు అయితే మరింత అమాయకులు. ఈ జిల్లాలో ప్రధా‌నంగా పత్తి , సోయా , జొన్న పంట సాగవుతుంది. విత్తనాల కొనుగోలు నుండి పంట సాగు వరకు.. చివరకు పంటను అమ్ముకోవడం వరకు నిత్యం మోసపోతున్నాడు ఈ జిల్లా రైతు. ఇంకా కొండలు గుట్టల్లో సంప్రదాయ పద్దతిలోనే సాగు చేస్తూ కష్టాలను‌ ఎదుర్కొంటున్నారు. పొలం దున్నడం నుండి పంట కోతకు వచ్చేంత వరకు అన్నీ పనులను యంత్రాల సాయంతో పూర్తవుతున్నా ఈ జిల్లా రైతాంగం మాత్రం ఇంకా సంప్రదాయ పద్దతులనే అవలంబిస్తున్నాయి.

అయితే జిల్లాలోని తాంసి మండలం పొన్నారి గ్రామ రైతులు మాత్రం ఆదునిక టెక్నాలజిని‌అంది పుచ్చుకుంటూ కాలాన్ని ఆదా చేసుకునేలా ఖర్చును తగ్గించుకుని ఆర్థికంగాను భళపడేలా టెక్నాలజీని వాడుతూ భళా అనిపిస్తున్నారు. డ్రోన్ ల సాయంతో విత్తనాలు‌ విత్తుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. శాస్త్రవేత్తలు క్షేత్ర పరిశీలన చేస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. పంట పొలాల్లో విత్తనాలు పెట్టడానికి కూలీల ఖర్చు సమయం ఆదా చేసేందుకు డ్రోన్ పరికరాలను ఉపయోగిస్తున్నారు పొన్నారి గ్రామ రైతులు. జిల్లాలోనే మొట్టమొదటి సారిగా విత్తనాలను వేసేందుకు ఈ డ్రోన్ ను వినియోగించారు తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే రైతు. త‌‌నకున్న పది ఎకరాల పంట చేనులో ప్రయోగాత్మకంగా నువ్వుల విత్తనాలను ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సహాకారంతో డ్రోన్ తో విత్తి శభాష్ అనిపించుకున్నాడు. డ్రోన్ ల సాయంతో విత్తనాలు విత్తేందుకు రైతు లక్ష్మణ్ ధైర్యంగా ముందడుగు వేయడంతో ఆయన వెంట నడిచేందుకు పొన్నారి గ్రామ రైతులు‌ సై అంటున్నారు.

ఈ డ్రోన్ వినియోగంతో‌ చాలా సమయం ఆదా అవుతుందని.. ఖర్చు కూడా మూడింతలు తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. సాధారణంగా రైతులు ఒక ఎకరం వ్యవసాయ భూమిలో విత్తనాలు విత్తాలంటే కనీసం ఒకరోజైన పడుతుందని, కానీ ఇలా డ్రోన్ తో విత్తుకుంటే కేవలం అరగంటలో పూర్తయిపోతుందని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డ్రోన్ తో విత్తనాలను వేయడం దేశంలోనే ప్రప్రథమమని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. ఎం. మునిగెల రఘువీర్ చెపుతున్నారు. ప్రస్తుతం పొన్నారిలో నువ్వుల పంట సాగుకు.. విత్తనాలు‌ విత్తేందుకు డ్రోన్ల ను పూర్తిస్థాయిలో విత్తనాలను వేయడం కోసం వినియోగిస్తున్నారని.. భవిష్యత్ లో పత్తి , కంది , సోయా పంటల విత్తనాలు విత్తేందుకు సైతం డ్రోన్లను అందు బాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ విధానంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని.. ముఖ్యంగా కూలీల కొరత అధిగమించవచ్చని చెపుతున్నారు శాస్త్రవేత్తలు. నువ్వుల పంట సాగులో భాగంగా వరుస.. వరుసకు  మధ్య 30 సెం.మీ.లు.. మొక్కకు మొక్కకు మధ్య 8 నుండి 10 సెం. మీలు దూరం వచ్చేలా డ్రోన్ లో టెక్నాలజిని ఫిక్స్ చేశామని.. ఈ పద్దతిలో విత్తనాలు విత్తడం సులభ తరం అంటున్నారు శాస్త్రవేత్తలు. సంప్రదాయ పద్దతులతో పోలిస్తే ఇలా డ్రోన్ వినియోగంతో సాగు పనుల్లో సమయం, ఖర్చు తగ్గుతుందని రైతులు సైతం అభిప్రాయపడుతున్నారు. కానీ వ్యక్తిగతంగా కొనుగోలు చేసే శక్తి లేని రైతులకు ఇలాంటి ఆధునిక వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వం రాయితీపై అందజేయాలని పొన్నారి రైతులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉంది..? ఈ తప్పులు చేశారో కష్టాలు
వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉంది..? ఈ తప్పులు చేశారో కష్టాలు
ఆ సినిమా ఆసక్తి లేకుండానే చేశా.. కట్ చేస్తే.. ఇప్పటికీ ట్రెండింగ్
ఆ సినిమా ఆసక్తి లేకుండానే చేశా.. కట్ చేస్తే.. ఇప్పటికీ ట్రెండింగ్
ఆ కారణంతోనే మళ్లీ బాలకృష్ణతో సినిమాలు చేయలేకపోయాను..
ఆ కారణంతోనే మళ్లీ బాలకృష్ణతో సినిమాలు చేయలేకపోయాను..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ నియమాలు.. ఏంటంటే..?
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ నియమాలు.. ఏంటంటే..?
పుచ్చకాయ తొక్కలతో టేస్టీ దోశలు.. ఎలా చేసుకోవాలో తెలుసా?
పుచ్చకాయ తొక్కలతో టేస్టీ దోశలు.. ఎలా చేసుకోవాలో తెలుసా?
కర్రల సాయంతో నడుస్తున్న కేకేఆర్ స్టార్ బౌలర్
కర్రల సాయంతో నడుస్తున్న కేకేఆర్ స్టార్ బౌలర్
ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలనుకున్నా..
ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలనుకున్నా..
పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. ఒక్కటైన హీరోహీరోయిన్..
పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. ఒక్కటైన హీరోహీరోయిన్..
తండ్రి డ్రైవర్..కొడుకు కండక్టర్.. హుస్నాబాద్ ఆర్టీసీలో సూపర్ సీన్
తండ్రి డ్రైవర్..కొడుకు కండక్టర్.. హుస్నాబాద్ ఆర్టీసీలో సూపర్ సీన్
డ్రోన్ తో విత్తనాలు నాటే ప్రక్రియ..నువ్వులు సాగు చేస్తున్న రైతులు
డ్రోన్ తో విత్తనాలు నాటే ప్రక్రియ..నువ్వులు సాగు చేస్తున్న రైతులు