AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొజ్తాబా ఖమేనీ ముఖం కాలిపోయిందా? మాట్లాడలేరా?

మొజ్తాబా ఖమేనీ ముఖం కాలిపోయిందా? మాట్లాడలేరా?

Phani CH
|

Updated on: Apr 25, 2026 | 12:03 PM

Share

ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ యుద్ధంలో తీవ్ర గాయపడి, కృత్రిమ కాలుతో అజ్ఞాతంలో ఉన్నారు. బహిరంగంగా కనిపించకుండా, కేవలం రాతపూర్వక సందేశాలతో పాలన సాగిస్తున్నారు. గాయాల కారణంగా బలహీనంగా కనిపించకూడదనే ఉద్దేశంతోనే ఆయన తెరవెనుక ఉన్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా, పాలన సైనిక జనరల్స్‌కు మళ్లుతోందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

ఫిబ్రవరి 28న అమెరికాతో యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే, అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా, అదే సమయంలో జరిగిన దాడిలో మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారు. ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ, ఇప్పటివరకు బహిరంగంగా కనిపించకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నారు, స్పృహలోనే ఉన్నారు. కానీ ఓ దాడిలో తీవ్రంగా గాయపడటంతో ఆయన ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లారు. బయటి ప్రపంచానికి కనిపించకుండా, వినిపించకుండా పాలనలో చురుగ్గా ఉన్నప్పటికీ, దేశంలో పాలన అంతా ఆయన చేతుల్లో నుంచి సైనిక జనరల్స్ కు మళ్లిందని న్యూయార్క్ టైమ్స్’ తన ప్రత్యేక కథనంలో తెలిపింది. మొజ్తాబా ఖమేనీ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. కాలికి మూడు సార్లు శస్త్రచికిత్స జరిగింది. ఆయనకు కృత్రిమ కాలు అమర్చినట్లు తెలుస్తోంది. ఆయన చేతుల్లో ఒకదానికి కూడా సర్జరీ జరిగింది. అతని ముఖం, పెదవులపై కాలిన గాయాలు ఉండటం వల్ల ఆయన మాట్లాడటం కష్టంగా మారింది. త్వరలోనే ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేయనున్నారు. కేవలం రాతపూర్వక సందేశాలతోనే దేశ పాలన సాగిస్తున్నారు. ఈ గాయాల వల్లే ఆయన ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్నారు. బలహీనంగా కనిపించడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో, ఆయన కెమెరాల ముందుకు రావడం లేదని అధికారులు అంటున్నారు. శారీరక గాయాలు ఉన్నప్పటికీ, ఆయన మానసికంగా చాలా చురుకుగా ఉన్నారని, కీలక నిర్ణయాలను స్వయంగా తీసుకుంటున్నారని సమాచారం. ఇరాన్ చరిత్రలో అత్యంత క్లిష్ట సమయాల్లో మొజ్తబా నాయకత్వం వహిస్తుండటంతో, ప్రపంచ దేశాలన్నీ ఆయన తదుపరి అడుగుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. యాంకర్‌- ఆయనకు సందేశాలు చేరవేయడానికి, ఆయన నుంచి ఆదేశాలు స్వీకరించడానికి అధికారులు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. చేతితో రాసిన లేఖలను సీల్డ్ కవర్లలో ఉంచి, కార్లు, మోటార్‌సైకిళ్లపై మానవహారంలా ఒకరి నుంచి ఒకరికి అందిస్తూ ఆయన రహస్య స్థావరానికి చేరవేస్తున్నారు. ఇజ్రాయెల్ మొసాద్‌ తమను గుర్తించి దాడి చేయొచ్చనే భయంతో సీనియర్ అధికారులు కూడా ఆయన్ను కలవడం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పక్కింటి వారి వల్ల నిద్ర కరువైంది.. అమెరికాలో ఇండియన్ ఫ్యామిలీ పై ఫిర్యాదు

చోరీ అయిన ఫోన్.. డిటెక్టివ్‌‌గా మారి దొంగను పట్టుకున్న వ్యక్తి..

ఆ జలసంధిలో.. 124 నౌకల శకలాలు

ఏపీలో కొత్తగా 1.5 లక్షల పింఛన్లు !! దరఖాస్తులు తీసుకునేది ఎప్పటి నుంచి అంటే…?

దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా

Follow Us