కాంగ్రెస్ పార్టీ వీడడానికి కారణం ఇదే.. TV9 క్రాస్ ఫైర్‌లో అసలు విషయం బయటపెట్టిన జీవన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడానికి గల కారణాలను వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతూ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని విమర్శించారు. పదవుల కోసం కాకుండా, ఆత్మగౌరవం కోసమే పార్టీ మారానన్న జీవన్ రెడ్డి.. కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు.
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ గూటికి చేరడం వెనుక ఉన్న అసలు కారణాలను మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టీవీ9 క్రాస్ ఫైర్‌లో కుండబద్దలు కొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వ వైఖరిపై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీలా కాకుండా రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారిపోయిందని ఆరోపించారు. భవిష్యత్తులో ఢిల్లీ పెద్దలకు ఎదురుతిరిగేందుకే రేవంత్ తనకంటూ ఒక సొంత కుంపటిని, సొంత ఎమ్మెల్యేల వర్గాన్ని తయారు చేసుకుంటున్నారని అన్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కనుమరుగైందని, కేవలం ప్రెజర్ టాక్టిక్స్ తోనే పాలన సాగుతోందని విమర్శించారు. ఇటువంటి వాతావరణంలో తాను ఇమడలేకే పార్టీ మారానని స్పష్టం చేశారు.
మంత్రి పదవి కోసం కాదు.. ఆత్మగౌరవం కోసం
“నేను మంత్రి పదవి కోసం పార్టీ మారాననడం హాస్యాస్పదం. అదే కావాలనుకుంటే ఢిల్లీ వెళ్లి తెచ్చుకునే వాడిని కదా?” అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పదవుల కోసం పాకులాడలేదని, రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలను, ముఖ్యంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారి చేరికను తాను మొదటి నుంచీ వ్యతిరేకించానని గుర్తు చేశారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా జగిత్యాల నియోజకవర్గంలోని వంతెన నిర్మాణం కోసం కేసీఆర్ రూ.75 కోట్లు కేటాయించారని కృతజ్ఞతగా గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ, కేసీఆర్‌లో ఉన్న ప్రజాస్వామ్యవాది వల్లే తెలంగాణ ఉద్యమం ఇంత బలోపేతమైందని ఆయన సమర్థించారు. ఈటల రాజేందర్ వంటి నాయకులు విడిపోవడాన్ని ప్రస్తావిస్తూ.. వారికి పార్టీలో తగిన గుర్తింపు, పదవులు లభించాయని ఆయన కౌంటర్ ఇచ్చారు.
చోరీ అయిన ఫోన్.. డిటెక్టివ్‌గా మారి దొంగను పట్టుకున్న వ్యక్తి..
ఆ జలసంధిలో.. 124 నౌకల శకలాలు
దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా
అన్నం పెట్టిన చేతిని మరువని శునకాలు.. మహిళ హత్య గుట్టు రట్టు
మోమోస్ తిన్న బాలికకులివర్ డ్యామేజ్.. చివరకు..!
కస్టమర్ కు రూ.3.21 లక్షల.. పరిహారాన్ని చెల్లించిన బ్యాంక్ !!
ముక్కు పుడకతో పరీక్ష హాలుకెళ్లిన విద్యార్థిని.. కట్ చేస్తే

