అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా: బాలీవుడ్‌కు కొత్త ఊపు
భూత్ బంగ్లా చిత్రంతో అక్షయ్ కుమార్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌కు తిరిగి ఊపునివ్వడమే కాకుండా, బాలీవుడ్‌లో పాజిటివ్ వైబ్‌ను సృష్టించింది. హారర్ కామెడీగా వచ్చి బాక్సాఫీస్ వద్ద 150 కోట్లకు చేరువవుతోంది. ప్రియదర్శన్-అక్షయ్ కాంబినేషన్ మళ్ళీ బ్లాక్‌బస్టర్‌గా నిరూపించుకుంది. ఈ విజయం బాలీవుడ్‌కు ఒక శుభసూచకం.
2026ని అసలు మర్చిపోలేనంటున్నారు అక్షయ్‌కుమార్. ఎన్నాళ్లుగానో వెయిట్ చేసిన సక్సెస్ వస్తే ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. ఈ సక్సెస్ తనది మాత్రమే కాదు, బాలీవుడ్‌ది కూడా అంటూ ఖిలాడి ఎందుకు చెబుతున్నట్టు? కమాన్ లెట్స్ వాచ్. మన మార్కెట్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ దూకుడుమీదుంది భూత్ బంగ్లా. రిలీజ్ అయిన ఐదు రోజుల్లో మూడు మిలియన్ల మార్క్ దాటేసి సక్సెస్‌ఫుల్ మార్చ్ చేస్తోంది. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే 150 కోట్ల క్లబ్‌లోకి అతి త్వరలో చేరుకోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండిట్స్. భూత్ బంగ్లాకి రూట్ మొత్తం క్లియర్‌గా ఉందనుకుంటే పొరపాటే. రిలీజ్ అయి నెల రోజులు దాటినా ధురంధర్2 ఉదృతి అసలు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ టైమ్‌లో భూత్‌బంగ్లా రిలీజ్ అవసరమా? అన్నవారూ లేకపోలేదు. దేని దారి దానిదే.. మా మూవీ కచ్చితంగా క్లిక్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో రిలీజ్ చేశారు అక్షయ్. హారర్ కామెడీ జానర్‌లో దూసుకుపోతోంది భూత్ బంగ్లా. ఈ మూవీ జస్ట్ ఖిలాడి కెరీర్‌ని గాడిలో పెట్టడమే కాదు, ధురంధర్ సక్సెస్‌ని కంటిన్యూ చేస్తూ బాలీవుడ్‌లో పాజిటివ్ వైబ్ సృష్టిస్తోందంటున్నారు అబ్జర్వర్స్. ప్రియదర్శన్, అక్షయ్‌కుమార్ కాంబినేషన్‌లో సినిమా అంటేనే బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు భూత్ బంగ్లాతో అది ప్రూవ్ అయింది. అందుకే నెక్స్ట్ వీరి కాంబోలో రాబోయే సినిమా మీద కూడా అప్పుడే మంచి హైప్ క్రియేట్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పక్కింటి వారి వల్ల నిద్ర కరువైంది.. అమెరికాలో ఇండియన్ ఫ్యామిలీ పై ఫిర్యాదు
చోరీ అయిన ఫోన్.. డిటెక్టివ్‌గా మారి దొంగను పట్టుకున్న వ్యక్తి..
ఏపీలో కొత్తగా 1.5 లక్షల పింఛన్లు !! దరఖాస్తులు తీసుకునేది ఎప్పటి నుంచి అంటే…?
చోరీ అయిన ఫోన్.. డిటెక్టివ్‌గా మారి దొంగను పట్టుకున్న వ్యక్తి..
ఆ జలసంధిలో.. 124 నౌకల శకలాలు
దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా
అన్నం పెట్టిన చేతిని మరువని శునకాలు.. మహిళ హత్య గుట్టు రట్టు
మోమోస్ తిన్న బాలికకులివర్ డ్యామేజ్.. చివరకు..!
కస్టమర్ కు రూ.3.21 లక్షల.. పరిహారాన్ని చెల్లించిన బ్యాంక్ !!
ముక్కు పుడకతో పరీక్ష హాలుకెళ్లిన విద్యార్థిని.. కట్ చేస్తే

