నాగార్జున సినిమాలో ఛాన్స్ వస్తే ఎలాంటి సాంగ్ అయిన చేస్తా.. బ్యూటీ.

Rajitha Chanti

Pic credit - Instagram

25 April 2026

బిగ్ బాస్ ఫేమ్ దివి వడ్త్య తన తాజా ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె కెరీర్ ఆకాంక్షలు, ప్రముఖ తారలతో తన అనుభవాలు పంచుకుంది. 

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసిన దివి, తదుపరి కింగ్ నాగార్జునతో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లేదా డ్యాన్స్ చేయాలని ఉందన్నారు. 

నాగార్జున అంటే తనకు ఎంతో గౌరవం, ప్రేమ అని, బిగ్ బాస్ షో తర్వాత ఆయన తన జీవితాన్ని మార్చివేశారని దివి వెల్లడించారు. ఆయనతో గడిపిన క్షణాలు తనకు చాలా ప్రత్యేకమన్నారు.

ఆయన పట్ల తనకు అపారమైన అభిమానం ఉందని ఆమె పేర్కొన్నారు. మహర్షి షూటింగ్ సమయంలో మహేష్ బాబు సెట్‌లో అత్యంత అందమైన వ్యక్తి అని దివి ప్రశంసించారు.

మహేష్ బాబు నుదుటిపై ఉన్న పుట్టుమచ్చను తాను ప్రస్తావించినప్పుడు ఆయన నవ్వడం, ఆ నవ్వు ఎంత క్యూట్‌గా ఉంటుందని.. జీవితంలో మరింత హ్యాండ్‌సమ్‌గా ఉంటారని అన్నారు.

చిరంజీవి గురించి మాట్లాడుతూ, ఆయనకు సానుకూలమైన ఆరా ఉంటుందని దివి పేర్కొన్నారు. ఆయన తోటి నటులకు బలాన్ని ఇస్తారని, మాటలతోనే నవ్వించేస్తారని తెలిపారు.

భయపడకుండా స్నేహితుడిలా నటించడానికి అవకాశం కల్పిస్తారని తెలిపారు. గాడ్ ఫాదర్ లో ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతి అని దివి చెప్పారు.

బిగ్ బాస్ హౌస్‌ను వీడినప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని దివి తెలిపారు. ఆ సమయంలో తాను మానసికంగా బలహీనపడ్డానని, భావోద్వేగాలకు గురవుతున్నానని అన్నారు.