AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Weekend Trip: వీకెండ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? హైదరాబాద్‌లో దుర్గం చెరువు అస్సలు మిస్‌ చేయకండి

వీకెండ్ వచ్చిందంటే కాస్త రిలాక్స్‌ అవడానికి మంచి టూరిస్ట్ స్పాట్‌ కోసం నెట్టింట తెగ వెతికేస్తుంటారు కొందరు ఉద్యోగులు. అయితే హైదరాబాద్‌లో ఉండే టెకీలు, ఇతర ఎంప్లాయిస్‌కి ఆ శ్రమ అక్కరలేదు. ఎందుకంటే భళారే అనిపించే కేఫ్‌లు, థ్రిల్లింగ్ యాక్టివిటీలు, కొత్త సినిమాల నుంచి ఎన్నో వీకెండ్ స్పాట్స్‌ నగర..

Hyderabad Weekend Trip: వీకెండ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? హైదరాబాద్‌లో దుర్గం చెరువు అస్సలు మిస్‌ చేయకండి
Durgam Cheruvu 3
Srilakshmi C
|

Updated on: Jun 14, 2024 | 12:55 PM

Share

వీకెండ్ వచ్చిందంటే కాస్త రిలాక్స్‌ అవడానికి మంచి టూరిస్ట్ స్పాట్‌ కోసం నెట్టింట తెగ వెతికేస్తుంటారు కొందరు ఉద్యోగులు. అయితే హైదరాబాద్‌లో ఉండే టెకీలు, ఇతర ఎంప్లాయిస్‌కి ఆ శ్రమ అక్కరలేదు. ఎందుకంటే భళారే అనిపించే కేఫ్‌లు, థ్రిల్లింగ్ యాక్టివిటీలు, కొత్త సినిమాల నుంచి ఎన్నో వీకెండ్ స్పాట్స్‌ నగర వాసులకు అతి చేరువలోనే ఉన్నాయి. అటువంటి ప్రదేశాల్లో దుర్గం చెరువు ఒకటి.

Durgam Cheruvu 3

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న దుర్గం చెరువు వాతావరణం ప్రశాంతంగా.. ఆహ్లాదకరంగా.. ఉంటుంది. ఇది 63 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. మాదాపూర్ – జూబ్లీ హిల్స్ ప్రాంతాల మధ్య ఉన్న ఇనార్బిట్ మాల్ సమీపంలోనే దుర్గం చెరువు ఉంది. ఇక్కడి నిర్మలమైన, విశాలమైన నీటిలో బోటింగ్‌ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇది హైదరాబాద్‌లోని అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఒకటి పేరుగాంచింది.

Durgam Cheruvu 2

దుర్గం చెరువులో పడవ ప్రయాణం వింత అనుభూతికి గురి చేస్తుంది. చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి, చల్లని వాతావరణం హాయినిస్తుంది. దుర్గం చెరువు పార్క్‌లో పిక్నిక్‌కు కుటుంబం, స్నేహితులతో కలసి వెళ్లవచ్చు. ఇక సాయంత్రం అయితే దుర్గం చెరువుపై నిర్మించిన బ్రిడ్జి ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడి బ్రిడ్జిపై ఉండే లైటింగ్‌ చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. అలాగే ఇక్కడి మ్యూజికల్ ఫౌంటెన్ కూడా తప్పక చూడాలి. దీనిని రాత్రి 7 గంటల నుంచి చూడొచ్చు. నీటి జలాలపై రిథమాటిక్‌గా వెలిగే లైట్లు చూపరులను కట్టిపడేస్తాయి. ఇక్కడి నుంచి అతి చేరువలో ఉండే ఇనార్బిట్‌ మాల్‌ షాపింగ్‌కు చక్కని ప్రదేశం. అక్కడడి PVR సినిమాస్‌లో లేటెస్ట్‌ సినిమాలను కూడా వీక్షించవచ్చు.

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని డాక్టర్స్ కాలనీ సమీపంలోని దుర్గం చెరువు రోడ్డుకు ఆనుకుని ఉన్న ది లాస్ట్ హౌస్ కేఫ్ మరో చూడదగ్గ ప్రదేశం. ఈ కేఫ్ వాతావరణం, చుట్టూ పచ్చని ప్రకృతి మనసుకు హాయినిస్తుంది.

Durgam Cheruvu 1

ప్రకృతి అందాలు చూస్తూ నచ్చిన ఫుడ్ తింటూ, కప్పు కాఫీ తాగితే దిల్‌ ఖుష్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. దుర్గం చెరువును వీక్షించేందుకు మీ ప్రియమైన వారితో కలిసి ఈ వీకెండ్‌ ఎంజాయ్‌ చేయండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.