AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Schengen Visa: పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. యూరప్ ట్రిప్ అంటే జేబుకు చిల్లే..

ముఖ్యంగా యూరప్ దేశాలను చూడటానికి ప్రపంచంలో పర్యాటకులు ఆసక్తి చూపుతారు. అక్కడి వాతావరణం, చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు చాలా బాగుంటాయి. యూరప్ దేశాలకు సందర్శించాలంటే స్కెంజెన్ వీసా తీసుకోవాలి. దీని ద్వారా యూరోపియన్ యూనియన్ లోని దాదాపు 29 దేశాలలో పర్యటించవచ్చు. అయితే స్కెంజెన్ వీసా ధర దాదాపు 12 శాతం పెరిగింది. ఈ ఏడాది జూన్ 11 నుంచి అమలులోకి వచ్చింది.

Schengen Visa: పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. యూరప్ ట్రిప్ అంటే జేబుకు చిల్లే..
Europe Tour
Madhu
|

Updated on: Jun 14, 2024 | 4:47 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగానికి ఆదరణ పెరుగుతోంది. వివిధ దేశాలలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇంటర్నెట్ వాడకం పెరిగిన నేపథ్యంలో ప్రపంచంలోని గొప్ప పర్యాటక ప్రాంతాలను తెలుసుకుంటున్నారు. అక్కడకు వెళ్లడానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఆయా ప్రదేశాలను సందర్శిస్తున్నారు.

యూరప్ అంటే ఆసక్తి..

ముఖ్యంగా యూరప్ దేశాలను చూడటానికి ప్రపంచంలో పర్యాటకులు ఆసక్తి చూపుతారు. అక్కడి వాతావరణం, చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు చాలా బాగుంటాయి. యూరప్ దేశాలకు సందర్శించాలంటే స్కెంజెన్ వీసా తీసుకోవాలి. దీని ద్వారా యూరోపియన్ యూనియన్ లోని దాదాపు 29 దేశాలలో పర్యటించవచ్చు. అయితే స్కెంజెన్ వీసా ధర దాదాపు 12 శాతం పెరిగింది. ఈ ఏడాది జూన్ 11 నుంచి అమలులోకి వచ్చింది.

పెరిగిన వీసా ధర..

పెరిగిన వీసా ధరలతో యూరప్ ట్రిప్ పర్యాటకులకు భారంగా మారనుంది. గతంలో స్కెంజెన్ వీసా కోసం పెద్ద వారికి 80 యూరోలు, ఆరు నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లలకు 40 యూరోలు వసూలు చేసేవారు. ఇప్పుడు పెద్దలకు 90 యూరోలు, పిల్లలకు 45 యూరోలకు పెంచారు. అంటే పాత ధరలపై దాదాపు 12 శాతం పెరిగింది. ఒక్క యూరో మన 90 రూపాయలకు సమానం. అలాగే ఈయూలో అక్రమంగా ఉంటున్న తమ పౌరులను స్వదేశానికి అనుమతించని దేశాల వారికి వీసా ధరను 135 నుంచి 180 యూరోలకు పెంచేశారు.

90 రోజుల గడువు..

యూరోపియన్ కమిషన్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు షార్ట్-స్టే స్కెంజెన్ వీసా (సీ టైప్)లను మంజూరు చేస్తుంది. దీని ద్వారా ఆయా దేశాలలో 90 రోజులు పర్యటించవచ్చు. వీటి ఫీజులనే 12 శాతం పెంచింది. జూన్ 11 నుంచి కొత్త ధర అమలు చేసింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న సివిల్ సర్వెంట్ జీతాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ముందు 2020 ఫిబ్రవరిలో వీసా ఫీజు పెంచింది. స్కెంజెన్ వీసా కోడ్ ప్రకారం ప్రతి మూడేళ్ల కు ఒకసారి వీసా రేట్లను పెంచుతారు.

యూరోపియన్ దేశాలు ఇవే..

ఐరోపాలోని 29 దేశాల సమాఖ్యను స్కెంజెన్ ప్రాంతం అని పిలుస్తారు. ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగరీ, ఐస్‌లాండ్, ఇటలీ, లాట్వియా, లీచ్‌టెన్‌స్టెయిన్, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్ తదతర దేశాలు ఇందులో ఉన్నాయి. స్కెంజెన్ దేశాలలో ఒకటి వీసా జారీ చేస్తే మిలిగిన దేశాలలో కూాడా పర్యటించే అవకాశం ఉంటుంది. అయితే ఈయూతో వీసా రహిత ప్రయాణ ఒప్పందం కోసం ఎదురుచూస్తున్న టర్కీ పౌరులకు కొత్త నిర్ణయం నిరాశ కలిగించింది.

మూడో స్థానంలో భారత్..

స్కెంజెన్ ప్రాంతంలో పర్యటించడానికి 2023లో 10.3 మిలియన్లకు పైగా షార్ట్-స్టే వీసా దరఖాస్తులు వచ్చాయి. గతేడాదితో పోల్చితే 37 శాతం పెరుగుదల నమోదైంది. కానీ ఇది 2019లో వచ్చిన 17 మిలియన్ల దరఖాస్తులంటే తక్కువగా ఉంది. అలాగే వీసా దరఖాస్తులలో 966,687తో మన దేశం మూడోస్థానంలో నిలిచింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!