Indian Railways: రైలులో చెత్త వేస్తే పదింతల జరిమానా.. రైల్వేశాఖ కొత్త నిబంధనలు..

దేశంలోని ప్రముఖ రవాణా సాధనమైన రైళ్లలో చెత్త సమస్య ఎక్కువగా ఉంటుంది. బోగీలన్నీ దాదాపు చెత్తతో నిండి ఉంటాయి. ప్రయాణికులు డస్ట్ బిన్లను అస్సలు వాడారు. బిస్కెట్లు, స్నాక్స్, భోజనం తిన్న తర్వాత వాటి కవర్లు, పేపర్లను రైలులోని సీట్ల కింద పాడేస్తున్నారు. ఏసీ కంపార్ట్‌మెంట్లలో కూడా ఈ సమస్య ఉంటోంది. దీనివల్ల అపరిశుభ్రతతో పాటు రోగాలు ప్రబలుతాయి. అలాగే ప్రయాణానికి అసౌకర్యంగా ఉంటుంది.

Indian Railways: రైలులో చెత్త వేస్తే పదింతల జరిమానా.. రైల్వేశాఖ కొత్త నిబంధనలు..
Indian Railways
Follow us

|

Updated on: Jun 14, 2024 | 5:25 PM

పరిశుభ్రత అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. మన ఇళ్లతో పాటు పాటు పరిసరాలను కూడా చెత్త లేకుండా నీట్‌గా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. దీనివల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రధానంగా రోగాలు ప్రబలకుండా ఉంటాయి. అలాగే చెత్తను శుభ్రం చేయడానికి ప్రభుత్వాలకు అదనపు ఖర్చు ఉండదు. దేశంలో చాలామంది ప్రజలు తమ ఇళ్లను చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటారు. కానీ పరిసరాలను మాత్రం పట్టించుకోరు.

రైళ్లలో చెత్త సమస్య..

దేశంలోని ప్రముఖ రవాణా సాధనమైన రైళ్లలో చెత్త సమస్య ఎక్కువగా ఉంటుంది. బోగీలన్నీ దాదాపు చెత్తతో నిండి ఉంటాయి. ప్రయాణికులు డస్ట్ బిన్లను అస్సలు వాడారు. బిస్కెట్లు, స్నాక్స్, భోజనం తిన్న తర్వాత వాటి కవర్లు, పేపర్లను రైలులోని సీట్ల కింద పాడేస్తున్నారు. ఏసీ కంపార్ట్‌మెంట్లలో కూడా ఈ సమస్య ఉంటోంది. దీనివల్ల అపరిశుభ్రతతో పాటు రోగాలు ప్రబలుతాయి. అలాగే ప్రయాణానికి అసౌకర్యంగా ఉంటుంది.

రైల్వేశాఖ చర్యలు..

భారతీయ రైల్వే ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది. చెత్తను సీట్ల కింద వేయవద్దని ఎంత చెప్పినా కొందరు ప్రయాణికులు వినకపోవడంతో జరిమానా విధించడం ప్రారంభించింది. వారు తిన్న ఆహారం రేటు కంటే పదిరెట్టు పెనాల్టీ విధిస్తోంది.

పరిశుభ్రతకు ప్రాధాన్యం..

దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత గురించి ఆ శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేకించి ఆగ్రా డివిజన్‌లో స్టేషన్ల, రైళ్లను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రచారం నిర్వహిస్తోంది. టిక్కెెట్ లేకుండా ప్రయాణించే వారిని పట్టుకునేందుకు తనిఖీలు చేస్తోంది. పరిమితికి మించి లగేజీ తీసుకెళుతున్న వారిపైనా నిఘా ఉంచింది. అలా ప్రయాణిస్తూ పట్టుబడిన వారి నుంచి జరిమానా వసూలు చేస్తోంది. రైళ్లలోని మరుగుదొడ్లలో దాక్కున్న వ్యక్తులతో పాటు వివిధ చోట్ల దాచిన లగేజీని కూడా గుర్తించి అపరాధ రుసుము వసూలు చేస్తోంది.

అవగాహన..

టికెట్ తీసుకోకుండా ప్రయాణించేవారికి జరిమానా విధించడంతో పాటు వారికి రైల్వే అధికారులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అలా ప్రయాణం చేయడం వల్ల రైల్వేకి కలిగే నష్టాలను తెలియజేస్తున్నారు. మళ్లీ అటువంటి తప్పులు చేయకుండా అవగాహన కల్పిస్తున్నారు. టిక్కెట్లు లేకుండా ప్రయాణించడం, అనుమతి లేకుండా అదనపు సామగ్రి తీసుకువెళ్లడం నేరమని చెబుతున్నారు.

పదిరెట్ల జరిమానా..

రైళ్లలో శుభ్రతను మెరుగుపరిచడంలో భాగంగా అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఓ ప్రయాణికుడు చిప్స్, బిస్కెట్లు తిని వాటి కవర్లను సీటు కింద పాడేశాడు. దానిని చూసిన రైల్వే అధికారులు అతడికి జరిమానా విధించారు. పది రూపాయల చిప్స్ ప్యాకెట్ కవర్ వేసినందుకు, దానికి విలువకు పదిరేట్లు వసూలు చేశారు. ఇలా చేయడం వల్ల చెత్త పారవేయడానికి డస్ట్ బిన్లను ప్రయాణికులు ఉపయోగిస్తారని వారి ఉద్దేశం. ఇలాగే చెత్త వేసినందుకు 22 మంది నుంచి రూ.2400, మిగిలిన కారణాలతో 304 మంది ప్రయాణికుల నుంచి రూ.1,23,075 జరిమానా వసూలు చేశారు. అలాగే టికెట్ లేని 243 మంది ప్రయాణికుల నుంచి దాదాపు రూ.1,02,945 వసూలు చేశారు.

నిబంధనలు పాటించాలి..

రైలు ప్రయాణికులందరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, అందుకోసమే ఆగ్రా డివిజన్‌లో నిరంతరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ప్రజాసంబంధాల అధికారి ప్రశాంతి శ్రీవాస్తవ తెలిపారు. ఇటువంటి ఆకస్మిక తనిఖీల వల్ల ప్రజలు పరిశుభ్రతపై అవగాహన పెంచుకుంటారన్నారు. ప్రయాణికులు సరైన టికెట్ తీసుకుని, నిబంధనల ప్రకారం లగేజీ తీసుకువెళ్లాలని కోరారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..