AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad CCS Inspector: మరో అవినీతి చేప భాగోతం బట్టబయలు.. రూ.15 లక్షల లంచం డబ్బు వదిలేసి రోడ్డుపై పరుగో.. పరుగు..

సాధారణంగా దొంగలు పరుగెత్తించి, వెంటాడి.. వేటాడి కటకటాల వెనుక వేస్తుంటారు పోలీసులు. కానీ ఓ పోలీస్‌ తప్పుడు పని చేస్తూ అధికారుల కంటపడటంతో నడి రోడ్డుపై పరుగు లంకించుకున్నాడు. ఆనక ఆధికారులు అతన్ని దొరకబుచ్చుకుని కటకటాల వెనుక వేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో గురువారం (జూన్‌ 13) చోటు చేసుకోవడం కలకలం రేపింది. నేరం చేసిన వారి నుంచి డబ్బు గుంజుకుని కేసులు..

Hyderabad CCS Inspector: మరో అవినీతి చేప భాగోతం బట్టబయలు.. రూ.15 లక్షల లంచం డబ్బు వదిలేసి రోడ్డుపై పరుగో.. పరుగు..
Hyderabad CCS Inspector arrest
Srilakshmi C
|

Updated on: Jun 14, 2024 | 10:47 AM

Share

హైదరాబాద్‌, జూన్‌ 14: సాధారణంగా దొంగలు పరుగెత్తించి, వెంటాడి.. వేటాడి కటకటాల వెనుక వేస్తుంటారు పోలీసులు. కానీ ఓ పోలీస్‌ తప్పుడు పని చేస్తూ అధికారుల కంటపడటంతో నడి రోడ్డుపై పరుగు లంకించుకున్నాడు. ఆనక ఆధికారులు అతన్ని దొరకబుచ్చుకుని కటకటాల వెనుక వేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో గురువారం (జూన్‌ 13) చోటు చేసుకోవడం కలకలం రేపింది. నేరం చేసిన వారి నుంచి డబ్బు గుంజుకుని కేసులు కొట్టివేస్తున్న సదరు లంచావతారి బండారం తాజా ఘటనతో బట్టబయలైంది. వివరాల్లోకెళ్తే..

బషీర్‌బాగ్‌లోని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) కార్యాలయం ముందు గురువారం సాయంత్రం సినీఫక్కీలో ఈ హైడ్రామా నడించింది. హైదరాబాద్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనామిక్ అఫెన్స్ వింగ్ టీమ్ VIIతో కలిసి పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ చామకూరి సుధాకర్ రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన కన్సల్టెంట్‌ మణిరంగస్వామి అయ్యర్‌ (45).. తనకు వ్యాపార విస్తరణ సలహాలిస్తానంటూ రూ.లక్షల్లో మోసం చేశాడని అల్వాల్‌కు చెందిన ఫార్మా వ్యాపారి సీవీఎస్‌ సత్యప్రసాద్‌ (56) హైదారబాద్‌ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసును ఈవోడబ్ల్యూ టీమ్‌-7 ఇన్‌స్పెక్టర్‌ చామకూరి సుధాకర్‌ దర్యాప్తు చేస్తున్నాడు. కేసు మాఫీ చేయాలని నిందితుడు మణిరంగస్వామి.. సుధాకర్‌ను సంప్రదించాడు.

అందుకు నిందితుడి నుంచి ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ రూ.15 లక్షలు డిమాండ్‌ చేశాడు. అయితే ఆ మొత్తాన్ని విడతల వారీగా ఇచ్చేందుకు ఒప్పందం కుదరడంతో తొలివిడతలో రూ.5 లక్షలు పుచ్చుకున్నాడు. గురువారం మధ్యాహ్నం సీసీఎస్ కార్యాలయంలోని పార్కింగ్ ఏరియాలో ఇన్‌స్పెక్టర్‌కు రెండో విడత కింద రూ.3 లక్షలు సమర్పిస్తున్న సమయంలో.. అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ బృందం ఎంట్రీ ఇచ్చింది. అంతే చేతిలోని డబ్బు అక్కడే వదిలేసి పలాయనం చిత్తగించాడు. సీసీఎస్ కార్యాలయం ఎదుట రోడ్డుపైకి పరుగులంకించుకున్న ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ను ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ సతీశ్, ముగ్గురు కానిస్టేబుళ్లు వెంటాడి అరెస్ట్‌ చేశారు. అనంతరం ఇన్‌స్పెక్టర్‌ షోల్డర్‌ బ్యాగ్‌ నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, అతడిని హైదరాబాద్‌ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్డు ఇన్‌స్పెక్టర్‌కు రిమాండు విధించింది.

2009 బ్యాచ్‌కు చెందిన సుధాకర్‌.. ఎల్బీనగర్, మేడిపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్‌లో ఎస్సైగా పనిచేశాడు. అన్ని చోట్ల అతనిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఎక్కువగా క్రైం విభాగంలో పనిచేసిన సుధాకర్‌.. పలు కేసుల విషయంలో ఉన్నతాధికారుల్ని తప్పుదోవ పట్టించేడు. ఘట్‌కేసర్‌లో క్రైం ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో.. అక్కడి ఇన్‌స్పెక్టర్‌కు సుధాకర్‌ ప్రవర్తనపై అనుమానం వచ్చి సైబర్‌క్రైం విభాగానికి మార్చారు. ఆ తర్వాత వివిధ చోట్ల పనిచేసిన సుధాకర్‌ ప్రస్తుతం సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.