AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group1 Answer Key: టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్సర్‌ కీ విడుదల.. అభ్యంతరాలకు జూన్ 17 వరకు ఛాన్స్

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్‌ కీ విడుదలైంది. కీ తో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టినరోజు వివరాలు అధికారిక వెబ్‌సైట్లో నమోదు చేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ‘కీ’ పై అభ్యర్థుల అభ్యంతరాలను ఈ జూన్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించేందుకు అవకాశం కల్పించింది..

TGPSC Group1 Answer Key: టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్సర్‌ కీ విడుదల.. అభ్యంతరాలకు జూన్ 17 వరకు ఛాన్స్
TGPSC Group1 Answer Key
Srilakshmi C
|

Updated on: Jun 14, 2024 | 10:04 AM

Share

హైదరాబాద్‌, జూన్‌ 14: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్‌ కీ విడుదలైంది. కీ తో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టినరోజు వివరాలు అధికారిక వెబ్‌సైట్లో నమోదు చేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ‘కీ’ పై అభ్యర్థుల అభ్యంతరాలను ఈ జూన్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించేందుకు అవకాశం కల్పించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు కేవలం ఇంగ్లిష్‌ భాషలో మాత్రమే స్వీకరించనున్నారు. ఇతర భాషలో వచ్చిన అభ్యంతరాలు, ఈ-మెయిల్‌, వ్యక్తిగతంగా వచ్చే అభ్యంతరాలను స్వీకరించ బోమని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ స్పష్టం చేశారు. అభ్యంతరాలను పూర్తి ఆధారాలతో సహా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

టీజీపీఎస్సీ గ్రూపు-1 ప్రిలిమ్స్‌ మాస్టర్ ప్రశ్నపత్రం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

టీజీపీఎస్సీ గ్రూపు-1 ప్రిలిమ్స్‌ ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

కాగా మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ ప్రిలిమ్స్ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. దాదాపు 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్‌ కీ రూపొందించి, ఆపై ఫలితాలను కూడా వెనువెంటనే ప్రకటిస్తారు. తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షలను అక్టోబరు 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్ ప‌రీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే..

అక్టోబ‌ర్ 21వ తేదీన జ‌న‌ర‌ల్ ఇంగ్లీష్‌ (క్వాలిఫ‌యింగ్ టెస్ట్) అక్టోబ‌ర్ 22వ తేదీ పేప‌ర్ 1 (జ‌న‌ర‌ల్ ఎస్సే) అక్టోబ‌ర్ 23వ తేదీ పేప‌ర్ 2 (హిస్టరీ, క‌ల్చర్ అండ్ జియోగ్రఫీ) అక్టోబ‌ర్ 24వ తేదీ పేప‌ర్ 2 (ఇండియ‌న్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గ‌వ‌ర్నెన్స్‌) అక్టోబ‌ర్ 25వ తేదీ పేప‌ర్ 4 (ఎకాన‌మి అండ్ డెవ‌ల‌ప్‌మెంట్) అక్టోబ‌ర్ 26వ తేదీ పేప‌ర్ 5 (సైన్స్ అండ్ టెక్నాల‌జీ అండ్ డాటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్) అక్టోబ‌ర్ 27వ తేదీ పేప‌ర్ 6 (తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేష‌న్)

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.