TG ICET 2024 Results: నేడే తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్‌ 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు జూన్‌ 14 (శుక్రవారం) విడుదలకానున్నాయి. శుక్రవారం (జూన్‌ 14) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. జూన్‌ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో..

TG ICET 2024 Results: నేడే తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..
TG ICET 2024 Results
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 14, 2024 | 8:21 AM

హైదరాబాద్‌, జూన్‌ 14: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్‌ 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు జూన్‌ 14 (శుక్రవారం) విడుదలకానున్నాయి. శుక్రవారం (జూన్‌ 14) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. జూన్‌ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77,942 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది ఐసెట్‌ ప్రవేశ పరీక్షను వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహించింది.

కాగా తెలంగాణ ఐసెట్‌ పరీక్షలో వచ్చిన ర్యాంకు ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

తెలంగాణ ఐసెట్-2024 ఫలితాల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ దోస్త్‌ 2024 రెండో విడత రిజిస్ట్రేషన్‌ తుది గడువు పెంపు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలను దోస్త్‌ ద్వారా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి రెండో విడత రిజిస్ట్రేషన్‌ గడువును జూన్‌ 15వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్ధులు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసే గడువు జూన్‌ 12తో ముగియగా.. దాన్ని కూడా జూన్‌ 15 వరకు పెంచినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.