నైట్ టైమ్ అస్సలే తినకూడని ఫ్రూట్స్ ఇవే!

Samatha

07 march 2026

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ఎంతో ఇష్టంగా పండ్లు తింటారు. ఇందులో ఉండే పోషకాలు, శరీరానికి చాలా మేలు చేస్తాయి.

పండ్లు

అయితే కొంత మంది ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో పండ్లు తింటే కొంత మంది మాత్రం రాత్రి సమయంలో పడుకునే ముందు పండ్లు తింటారు. కానీ కొన్ని రకాల పండ్లు పడుకునే ముందు అస్సలే తినకూడదంట.

మధ్యాహ్నం

రాత్రి సమయంలో కొన్ని పండ్లు తినడం వలన ఎసిడిటీ , అధిక ఆమ్లత్వం వంటి అనేక సమస్యలు వస్తాయంట. కాగా, అసలు రాత్రి సమయంలో ఎలాంటి పండ్లు తినకూడదో ఇప్పుడు మనం చూద్దాం.

రాత్రి సమయంలో తినకూడనివి

అరటి పండ్లు : అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వైద్యులు కూడా తప్పకుండా, రోజుకు ఒక అరటి పండు తినాలని చెబుతారు. కానీ రాత్రి పడుకునే ముందు మాత్రం అస్సలే అరటి పండు తినకూడదంట.

అరటి పండ్లు

పైనాపిల్ : పైనాపిల్ ‌లో బ్రోమలైన్ అనే ఎంజామ్ ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని రాత్రి సమయంలో తినడం మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు, ఇది గుండెల్లో మంటకు కారణం అవుతుందంట.

పైనాపిల్

నారింజ : నారింజ పండు కూడా ఎప్పుడూ కూడా రాత్రి సమయంలో పడుకునే ముందు తినకూడదంట, ఇది యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట వంటి సమస్యలకు కారణం అవుతుంది.

నారింజ

ద్రాక్ష పండ్లు : ద్రాక్ష పండ్లు చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు, కానీ వీటిని రాత్రి సమయంలో తినడం అస్సలే మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ద్రాక్షపండ్లు

డైఫ్రూట్స్ : డ్రైఫ్రూట్స్  కూడా అస్సలే రాత్రి సమయంలో తినకూడదంట. వీటిలో ఫైబర్, అధిక చక్కెర ఉంటుంది. కాబట్టి వీటిని రాత్రి సమయంలో తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి.

డ్రైఫ్రూట్స్