Watch Video: అయ్యబాబోయ్ ఏంటి ఈ అఘాయిత్యం.. భార్య మందలించిందని కరెంట్‌తో చలగాటం
మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తను భార్య మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన మోహన్ బాబు సంకేశ్వర్ బజార్ రోడ్డులోని హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. భార్య వేధింపులు భరించలేక మోహన్‌బాబు (25) అనే యువకుడు గురువారం ఈ చర్యకు పాల్పడ్డాడు. సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో సాధారణ కూలీగా పనిచేస్తున్న మోహన్‌బాబు తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అతడిని భార్య మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన బాబు సంకేశ్వర్ బజార్ రోడ్డులోని హైటెన్షన్ విద్యుత్ టవర్ వద్దకు వెళ్లి దానిపైకి ఎక్కాడు.

ఇది గమనించిన స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ లైన్ మెన్ కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఇదే క్రమంలో హైటెన్షన్ విద్యుత్ టవర్ వద్దకు పోలీసులు కూడా చేరుకున్నారు. మోహన్ బాబును కిందికి దింపే ప్రయత్నం చేశారు. ఎంత బ్రతిమలాడినప్పటికీ కిందకు దిగకపోవడంతో పోలీసు సిబ్బంది టవర్ ఎక్కి అతనిని స్వయంగా కిందకు దించేందుకు ప్రయత్నించారు. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు టవర్ ఎక్కుతుండడం గమనించిన మోహన్ బాబు కిందకు దిగివచ్చారు. అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భార్య తనను వేధిస్తున్నదని, దీంతో కోపోద్రిక్తుడైన బాబు ఈ పనికి పాల్పడ్డాడని పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు చిన్నపాటి కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ అనంతరం బాబును కుటుంబసభ్యులకు అప్పగించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..