AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న విచారణ.. కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టుపై బహిరంగ విచారణకు రెడీ అవుతోంది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్. ఈ ఎపిసోడ్‌లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌కు నోటీసులు ఇవ్వబోతోందని టాక్. త్వరలో మరోసారి ఆకస్మిక పర్యటనలకు రెడీ అవుతోంది కమిషన్. నిన్న హైడ్రాలజీ, నిపుణుల కమిటీలను విచారించిన జస్టిస్ ఘోష్.. నేడు ఇంకొందరిని పిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. హైడ్రాలజీ, నిపుణుల కమిటీ ఇంజినీర్లను కమిషన్ విచారించింది.

Telangana: కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న విచారణ.. కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు..?
Kaleshwaram Project
Srikar T
|

Updated on: Jun 14, 2024 | 11:44 AM

Share

కాళేశ్వరం ప్రాజెక్టుపై బహిరంగ విచారణకు రెడీ అవుతోంది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్. ఈ ఎపిసోడ్‌లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌కు నోటీసులు ఇవ్వబోతోందని టాక్. త్వరలో మరోసారి ఆకస్మిక పర్యటనలకు రెడీ అవుతోంది కమిషన్. నిన్న హైడ్రాలజీ, నిపుణుల కమిటీలను విచారించిన జస్టిస్ ఘోష్.. నేడు ఇంకొందరిని పిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. హైడ్రాలజీ, నిపుణుల కమిటీ ఇంజినీర్లను కమిషన్ విచారించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తాము ఐడెంటీఫై చేసిన అంశాలను వివరించిన రెండు కమిటీలు.. ఎక్కువ నీటిని నిల్వ చేయడం వల్లే సమస్య తలెత్తిందని చెప్పినట్టు తెలుస్తోంది. రెండు వారాల లోపు మధ్యంతర నివేదిక, సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను అందించాలని రెండు కమిటీల ఇంజినీర్లను కమిషన్ ఆదేశించింది. టెక్నికల్ అంశాలపై అఫిడవిట్ ఫైల్ చేయాలని నిపుణుల కమిటీలకు సూచించింది. అఫిడవిట్ల పరిశీలన తర్వాత బహిరంగ విచారణ చేసేందుకు జస్టిస్​ పీసీ ఘోష్​ సిద్ధమవుతున్నారు. ఇందులో సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చేందుకు గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల మంత్రి హరీష్‌కు నోటీసులు ఇచ్చే అవకాశాలున్నట్టు టాక్ వినిపిస్తోంది.

మరోవైపు.. విజిలెన్స్​ ఇచ్చిన మధ్యంతర నివేదిక సమర్పించాలని గతంలోనే కమిషన్​ ఆదేశించినా.. అది ఇప్పటివరకు చేరలేదు. రిపోర్ట్ వెంటనే సమర్పించాలని మరోసారి ప్రభుత్వానికి, విజిలెన్స్ విభాగానికి లేఖ రాయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జస్టిస్​ పీసీ ఘోష్​ ఆకస్మిక పర్యటనలకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. టెక్నికల్ అంశాల తర్వాత ఆర్థిక అంశాలపై కమిషన్​ దృష్టి సారించనుంది కమిషన్. ఆనకట్ట నిర్మాణ అంచనాలు, రుణాలు, వడ్డీ రేట్లపై విచారణ చేయనుంది. విచారణలో భాగంగా ఇటీవల L అండ్ T, నవయుగ, ఆఫ్కాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యాయి. ఆరోపణలపై కమిషన్ వివరణ కోరగా.. తమకు టైం బౌండ్ పెట్టారని నిర్మాణం కంపెనీలు చెప్తున్నాయి.. ప్రభుత్వం విధించిన సమయంలో ప్రాజెక్టు పూర్తిచేసి అందించామని అంటున్నాయి. ఇదే విషయం అఫిడవిట్ రూపంలో సమర్పించాలని కమిషన్ సూచించింది. అఫిడవిట్‌లో సమాచారంతో విచారణను తప్పుదోవ పట్టించాలని చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులను హెచ్చరించింది కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రిపోర్ట్ ఇచ్చేందుకు జూన్ 30న డెడ్ కావడంతో నిర్మాణ కంపెనీలు, అధికారులు, సంబంధిత వ్యక్తుల నుంచి అన్ని వివరాలు సేకరిస్తోంది కమిషన్. శుక్రవారం మరికొంతమంది అధికారులను, ఇతర వ్యక్తులను విచారించనుంది కమిషన్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు