Bird Flu: బర్డ్ ఫ్లూ సోకిన కోడిని కూరొండి తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..

భారత్‌లో ఇప్పటి వరకు ఇద్దరికి బర్డ్ ఫ్లూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మంగళవారం ధృవీకరించింది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకడంతో అక్కడి స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. వైరస్‌ సోకిన చిన్నారికి ఇంట్లో, చుట్టుపక్కల ఉన్న కోళ్లతో ఎలాంటి సంబంధం లేకపోయినా.. బర్డ్ ఫ్లూ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. H9N2 వైరస్ వల్ల చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకిందని ప్రపంచ ఆరోగ్య..

Bird Flu: బర్డ్ ఫ్లూ సోకిన కోడిని కూరొండి తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
Bird Flu
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 16, 2024 | 12:19 PM

భారత్‌లో ఇప్పటి వరకు ఇద్దరికి బర్డ్ ఫ్లూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మంగళవారం ధృవీకరించింది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకడంతో అక్కడి స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. వైరస్‌ సోకిన చిన్నారికి ఇంట్లో, చుట్టుపక్కల ఉన్న కోళ్లతో ఎలాంటి సంబంధం లేకపోయినా.. బర్డ్ ఫ్లూ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. H9N2 వైరస్ వల్ల చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. దీంతో బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం, గుడ్లు వల్ల ఈ వ్యాధి సోకుతుందేమోనని ప్రజలు భయందోళన చెందుతున్నారు. నిజానికి, బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా పిలుస్తారు. ఇది పక్షులకే కాకుండా మనుషులకు, ఇతర జంతువులకు కూడా సోకే వైరస్. దీంతో బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తినడం సురక్షితమేనా? అనే సందేహం అందరికీ వస్తుంది. మ్యాక్స్ హాస్పిటల్‌కి చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్‌ వైశాలి పంకజ్ చౌదరి ఏం చెబుతున్నారంటే.. ‘బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తినడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అయినప్పటికీ మాంసం బాగా ఉడికించి తినవచ్చు. సరిగా ఉడికించకపోతే వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువ. కాబట్టి వంట చేసేటప్పుడు మరింత శుభ్రత పాటించాలి. పచ్చి చికెన్‌ని శుభ్రం చేసిన తర్వాత చేతులు, పాత్రలు శుభ్రం చేసుకోవాలి. అలాగే గుడ్లు వాడేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.

బర్డ్ ఫ్లూ లక్షణాలు ఏమిటి?

బర్డ్ ఫ్లూ సోకిన వారిలో తేలికపాటి నుండి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా వైరస్‌ సోకిన 2 నుండి 8 రోజుల తర్వాత దీని లక్షణాలు కనిపిస్తాయి. జలుబు వల్ల ముక్కు మూసుకుపోవడం, గొంతు నొప్పి, దగ్గు వంటి శ్వాసకోశ లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి తలనొప్పి, జ్వరం, అలసట, కండరాల నొప్పులు, వికారం, వాంతులు, విరేచనాలు వంటి జీర్ణ లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ తీవ్రం అధికంగ ఉంటే అవయవ వైఫల్యం, న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?

  • బర్డ్ ఫ్లూ రాకుండా చికెన్, గుడ్లను బాగా ఉడికించాలి.
  • వంట చేసేటప్పుడు పరిశుభ్రతను పాటించాలి. చేతులు, పాత్రలను తరచుగా వేడి నీటితో కడగాలి.
  • అనారోగ్యంతో ఉన్న పక్షులను లేదా కోళ్లను ముట్టుకోకూడదు. వీటికి వీలైనంత దూరంగా ఉండాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?