Andhra Pradesh: బొమ్మతో ఆడుకుంటూ బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

నెలల వయసున్న చిన్నారి బొమ్మతో ఆడుకుంటూ ఉండగా.. ఇంతలో బొమ్మలో ఉన్న బ్యాటరీ ఊడి బయటికి వచ్చింది. దీనిని చిన్నారి నోట్లో పెట్టుకుని మింగేసింది. పక్కనే ఉన్న తల్లి గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించింది. వైద్యులు ఆపరేషన్‌ చేయకుండా చాకచక్యంగా బ్యాటరీని బయటకు తీశారు. ఏమాత్రం కాస్త ఆలస్యం అయినా బ్యాంటరీ చిన్నారి కడుపులో పేలి ఉండేదని వైద్యులు తెలిపారు..

Andhra Pradesh: బొమ్మతో ఆడుకుంటూ బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!
Button Battery
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 16, 2024 | 11:14 AM

అమరావతి, జూన్‌ 16: నెలల వయసున్న చిన్నారి బొమ్మతో ఆడుకుంటూ ఉండగా.. ఇంతలో బొమ్మలో ఉన్న బ్యాటరీ ఊడి బయటికి వచ్చింది. దీనిని చిన్నారి నోట్లో పెట్టుకుని మింగేసింది. పక్కనే ఉన్న తల్లి గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించింది. వైద్యులు ఆపరేషన్‌ చేయకుండా చాకచక్యంగా బ్యాటరీని బయటకు తీశారు. ఏమాత్రం కాస్త ఆలస్యం అయినా బ్యాంటరీ చిన్నారి కడుపులో పేలి ఉండేదని వైద్యులు తెలిపారు. ఈ షాకింగ్‌ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం (జూన్‌ 15) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల చిన్నారి శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఆడుకుంటూ ఉండగా.. పొరపాటున బొమ్మలోని చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గమనించి.. స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు పరీక్షించి, వెంటనే విజయవాడకు తీసుకెళ్లమని సూచించారు. కుటుంబ సభ్యులు అంబులెన్సులో చిన్నారిని విజయవాడలోని ఆయుష్‌ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడి వైద్యులు ఎక్స్‌రే తీసి పరిశీలించారు. కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ ఇరుక్కున్నట్లు వైద్యులు గుర్తించారు. ఆలస్యం చేయకుండా వైద్యులు ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని చాకచక్యంగా బయటకు తీశారు.

ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు స్పందించి చిన్నారిని ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. చిన్నారి కడుపులో బ్యాటరీపై ఉండే స్టీల్‌ కోటింగ్‌ తొలగిపోయిందని, కాస్త ఉబ్బిందని.. మరికొంత సమయం అలాగే ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువయ్యేదని అన్నారు. సకాలంలో దానిని తొలగించడంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉందని, కొన్ని గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి.. తర్వాత ఇంటికి పంపివేసినట్లు ఆయుష్‌ ఆసుపత్రి వైద్యులు శ్రీహర్ష మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?