AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eid-ul-Fitr 2026: తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పండుగ ఎప్పుడంటే..?

దేశవ్యాప్తంగా శవ్వాల్ నెల చందమామ కనిపించకపోవడంతో రంజాన్ పండుగ తేదీపై స్పష్టత వచ్చింది. డెక్కన్ ముస్లిం ఉలేమా కౌన్సిల్‌కు చెందిన కేంద్ర రుయత్-ఎ-హిలాల్ కమిటీ ప్రకటించిన ప్రకారం, భారత్‌లో ఈద్ పండుగను మార్చి 21, శనివారం జరుపుకోనున్నారు. దీంతో పవిత్ర రమజాన్ మాసం శుక్రవారంతో ముగియనుంది.

Eid-ul-Fitr 2026: తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పండుగ ఎప్పుడంటే..?
Eid Ul Fitr 2026
Ram Naramaneni
|

Updated on: Mar 19, 2026 | 8:25 PM

Share

దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలపై స్పష్టత వచ్చింది. డెక్కన్ ముస్లిం ఉలేమా కౌన్సిల్‌కు చెందిన కేంద్ర రుయత్-ఎ-హిలాల్ కమిటీ అధ్యక్షుడు ప్రకటించిన వివరాల ప్రకారం, గురువారం శవ్వాల్ నెల చందమామ కనిపించకపోవడంతో భారత్‌లో ఈద్ పండుగను మార్చి 21, శనివారం జరుపుకోనున్నారు. దీంతో పవిత్ర రమజాన్ మాసం శుక్రవారంతో ముగియనుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రంజాన్ పండుగ శనివారం జరుపుకోనున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కేంద్ర రుయత్-ఎ-హిలాల్ కమిటీ తమ నెలవారీ సమావేశాన్ని నిర్వహించింది. శవ్వాల్ నెల చందమామ దర్శనంపై సమగ్రంగా చర్చించి, షరియా ప్రమాణాల ప్రకారం నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు కూడా చందమామ దర్శనంలో భాగస్వాములు కావాలని కమిటీ ముందుగానే విజ్ఞప్తి చేసింది.

Follow Us