CM Chandrababu: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అధికారులతో కీలక సమీక్ష ఎప్పుడంటే..

పోలవరం పనులు ఇక పరుగులు పెట్టిస్తామంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు. వారం వారం పోలవరం పనులను సమీక్షిస్తూ జెట్‌ స్పీడ్‌లో ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నామంటున్నారు. దీన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడమే లక్ష్యంగా ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించాలని డిసైడ్‌ అయ్యారు. జూన్ 17న సీఎం పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లపై ఫోకస్‌ పెట్టారు. పోలవరం ప్రాజెక్టులో 2016 నుంచి 2019 వరకు ఆవిష్కరించిన శిలాఫలకాలకు మెరుగులు దిద్దే పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి.

CM Chandrababu: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అధికారులతో కీలక సమీక్ష ఎప్పుడంటే..
Chandrababu Polavaram
Follow us

|

Updated on: Jun 16, 2024 | 11:28 AM

పోలవరం పనులు ఇక పరుగులు పెట్టిస్తామంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు. వారం వారం పోలవరం పనులను సమీక్షిస్తూ జెట్‌ స్పీడ్‌లో ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నామంటున్నారు. దీన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడమే లక్ష్యంగా ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించాలని డిసైడ్‌ అయ్యారు. జూన్ 17న సీఎం పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లపై ఫోకస్‌ పెట్టారు. పోలవరం ప్రాజెక్టులో 2016 నుంచి 2019 వరకు ఆవిష్కరించిన శిలాఫలకాలకు మెరుగులు దిద్దే పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. నివేదికలతో పాటు సర్వం సిద్ధం చేసే పనిలో ఉన్నారు అధికారులు. రేపు ఉదయం చంద్రబాబు పోలవరం చేరుకుని.. సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. అధికారులతో సమీక్ష చేయడంతో పాటు పనులపై దిశానిర్దేశం చేయనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ స్టేటస్‌పై ఉన్నతాధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. పనులు ఎంతవరకు వచ్చాయి? ఏఏ పనులు పెండింగ్‌ ఉన్నాయ్‌?. ఇంకా ఎంత శాతం పనులు పూర్తి చేయాలి? ఎప్పటివరకు కంప్లీట్‌ చేయగలం? ఇలా ప్రాజెక్ట్‌ స్థితిగతులపై ఇరిగేషన్‌ అధికారులను ఆరా తీశారు చంద్రబాబు.

గత నెల చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు వర్క్‌కు సంబంధించిన అధికారుల రిపోర్ట్‌ను ఓసారి పరిశీలిస్తే..హెడ్ వర్క్స్ పనులు 72.63 శాతం పూర్తయ్యాయని అధికారులు స్పష్టం చేశారు. రైట్ మెయిన్ కెనాల్ పనులు 92.75 శాతం పూర్తి కాగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు 73.07 శాతం పూర్తయ్యాయి. భూసేకరణ, పునరావాసం మాత్రం 22.55 శాతమే పూర్తయిందని అధికారులు చెప్పారు. ప్రాజెక్టులో అన్ని పనులు కలిపి 49.79 శాతం వరకు పూర్తయ్యాని అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. మెయిన్ డ్యామ్ ప్యాకేజ్‌లో భాగమైన స్పిల్‌వే అండ్ రేడియల్ గేట్ల పనులతో పాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు పూర్తయ్యాయి. అయితే ఎర్త్‌ కం రాక్ ఫిల్ డ్యామ్‌కు సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయి.

ఇక.. గ్యాప్-1కు సంబంధించి ఢయాప్రం వాల్ నిర్మాణం పూర్తి కాగా ప్రస్తుతం నేలను గట్టిపరిచే పనులు జరుగుతున్నాయి. గ్యాప్-2కు సంబంధించి నేలను గట్టిపరిచే పనులు జరుగుతున్నాయని.. డయా ఫ్రం వాల్ రిపేర్ల పనులు మొదలైయ్యాయని అధికారులు స్పష్టం చేశారు. గ్యాప్-3కి సంబంధించి కాంక్రీట్ డ్యామ్‌ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. స్పిల్ ఛానెల్‌కు సంబంధించిన పనులు 88 శాతం పనులు పూర్తి కాగా అప్రోచ్ ఛానెల్‌కు సంబంధించి 79 శాతం పనులు పూర్తయ్యాయి. పైలెట్ ఛానెల్ పనులు మాత్రం 48 శాతం జరిగాయి. రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీస్‌కు సంబంధించి 68 శాతం పనులు పూర్తయ్యాయి. పోలవరం పూర్తైతే ఏపీ రూపురేఖలే మారిపోతాయి. ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు పూర్తవుతుందా.. అని రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం
ఫ్యాషన్ షోలో మోడల్ గా డైరెక్టర్ సుకుమార్ కూతురు..
ఫ్యాషన్ షోలో మోడల్ గా డైరెక్టర్ సుకుమార్ కూతురు..
ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు.. రికార్డులు బ్రేక్ చేసిన జోడీ
ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు.. రికార్డులు బ్రేక్ చేసిన జోడీ
లేటు వయసులో పెళ్లి.. లేటెస్ట్ ట్రెండా..? లాభమెంత..? నష్టమెంత?
లేటు వయసులో పెళ్లి.. లేటెస్ట్ ట్రెండా..? లాభమెంత..? నష్టమెంత?
ఇల్లంతా ఆహ్లాదకరమైన సువాసన కోసం నీటిలో వీటిని కలిపి శుభ్రం చేయండి
ఇల్లంతా ఆహ్లాదకరమైన సువాసన కోసం నీటిలో వీటిని కలిపి శుభ్రం చేయండి