CM Salary: ఏపీ, తెలంగాణ సీఎంల జీతాలు ఎంత.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల వేతనాలు..

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎం అయ్యారు. అదే సమయంలో, ఒడిశాలో తొలిసారిగా బీజేపీ తరఫున మోహన్ చరణ్ మాఝీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ సీఎంలు నెలకు ఎంత జీతం తీసుకుంటారు అనే సందేశం చాలా మందిలో కలుగవచ్చు. ఇప్పుడు వాటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకేరకమైన జీతం ముఖ్యమంత్రులకు ఉండదు. వారి రాష్ట్ర పరిస్థితులు, స్థితిగతులను బట్టీ మారుతూ ఉంటుంది.

CM Salary: ఏపీ, తెలంగాణ సీఎంల జీతాలు ఎంత.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల వేతనాలు..
Cm Salarys
Follow us

|

Updated on: Jun 16, 2024 | 12:17 PM

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎం అయ్యారు. అదే సమయంలో, ఒడిశాలో తొలిసారిగా బీజేపీ తరఫున మోహన్ చరణ్ మాఝీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ సీఎంలు నెలకు ఎంత జీతం తీసుకుంటారు అనే సందేశం చాలా మందిలో కలుగవచ్చు. ఇప్పుడు వాటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకేరకమైన జీతం ముఖ్యమంత్రులకు ఉండదు. వారి రాష్ట్ర పరిస్థితులు, స్థితిగతులను బట్టీ మారుతూ ఉంటుంది.

ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జీతం ఎంత?

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు వేర్వేరుగా వేతనాలు ఉంటాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రికి బస, వాహనం, భద్రతతోపాటు దేశ విదేశాల్లో ఎక్కడికైనా వెళ్లే వెసులుబాటు ఉంటుంది. అంతే కాకుండా మంచి జీతం కూడా ఇస్తారు. ఒడిశా ముఖ్యమంత్రికి దాదాపు రూ.1.60 లక్షల జీతం ఇస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జీతం నెలకు రూ.3,35,000గా నిర్ణయించారు. దేశంలోని అనేక రాష్ట్రాలు తమ సొంత ప్రభుత్వ విమానాలు, హెలికాప్టర్లను కలిగి ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్‌తో పాటు పలువురు మంత్రులు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎవరికైనా ఉపయోగించుకోవడానికి ఇవ్వొచ్చు. కానీ సాధారణంగా ముఖ్యమంత్రి సమయాన్ని ఆదా చేయడానికి.. రహదారి-రైల్వే మార్గాల గుండా ప్రయాణం చేయడం వల్ల భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. వాటిని అధిగమించడానికి తక్కువ దూర ప్రయాణాలకు హెలికాప్టర్లను ఉపయోగిస్తారు. రాష్ట్రం నుండి బయటకు వెళ్లడానికి విమానాలను ఉపయోగిస్తారు.

త్రిపుర సీఎంకు అతి తక్కువ జీతం..

ముఖ్యమంత్రి చాలా తక్కువ జీతం పొందే రాష్ట్రాల్లో త్రిపుర ఉంది. త్రిపుర సీఎం దేశంలోనే అత్యల్ప జీతం రూ.1.05 లక్షలు పొందుతున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడింది. ఇది కూడా కొత్త, చిన్న రాష్ట్రంగా చెప్పవచ్చు. అయితే తెలంగాణ సీఎం దేశంలోనే అత్యధికంగా రూ.4.10 లక్షల వేతనం నెలకు పొందుతున్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధిక వేతనాలు తీసుకునే జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే అత్యధిక వేతనాలు తీసుకునే ముఖ్యమంత్రుల జాబితాలో ఢిల్లీ రెండో స్థానంలో ఉన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు నెలకు రూ.3.90 లక్షలు వేతనంగా చెల్లిస్తోంది ప్రభుత్వం. ఇక దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ నెలసరి జీతం రూ.3.60 లక్షలు తీసుకుంటున్నారు. ఈయన మూడవ స్థానంలో నిలిచారు.

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల వేతనాలు..

  • తెలంగాణ – రూ. 4,10,000
  • ఢిల్లీ – రూ. 3,90,000
  • ఉత్తరప్రదేశ్ – రూ. 3,65,000
  • మహారాష్ట్ర – రూ. 3,40,000
  • ఆంధ్రప్రదేశ్ – రూ. 3,35,000
  • గుజరాత్ – రూ. 3,21,000
  • హిమాచల్ ప్రదేశ్ – రూ. 3,10,000
  • హరియాణా – రూ. 2,88,000
  • జార్ఖండ్ – రూ. 2,55,000
  • మధ్యప్రదేశ్ – రూ. 2,30,000
  • ఛత్తీస్గడ్ – రూ. 2,30,000
  • పంజాబ్ – రూ. 2,30,000
  • గోవా – రూ. 2,20,000
  • బిహార్ – రూ. 2,15,000
  • పశ్చిమ బెంగాల్ – రూ. 2,10,000
  • తమిళనాడు – రూ. 2,05,000
  • కర్ణాటక – రూ. 2,00,000
  • సిక్కీం – రూ. 1,90,000
  • కేరళ – రూ. 1,85,000
  • ఉత్తరాఖండ్ – రూ. 1,75,000
  • రాజస్థాన్ – రూ. 1,75,000
  • ఒడిశా – రూ. 1,60,000
  • మేఘాలయ – రూ. 1,50,000
  • అరుణాచల్ ప్రదేశ్ – రూ. 1,33,000
  • అస్సాం – రూ. 1,25,000
  • మణిపూర్‌ – రూ. 1,20,000
  • నాగాలాండ్‌ – రూ. 1,10,000
  • త్రిపుర – రూ. 1,05,500

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles