Amaravati: మూడు ఫేజుల్లో కంప్లీట్.. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో ఎలాంటి మార్పులుండవ్: మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియేట్‌లో మంత్రి నారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసి… మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిగా బాధ్యతల స్వీకరించారు. గత అనుభవాలతో.. ఈసారి మరింత బాధ్యతగా, వేగంగా పని చేస్తానంటూ నారాయణ వెల్లడించారు.

Amaravati: మూడు ఫేజుల్లో కంప్లీట్.. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో ఎలాంటి మార్పులుండవ్: మంత్రి నారాయణ
Narayana
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 16, 2024 | 10:42 AM

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియేట్‌లో మంత్రి నారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసి… మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిగా బాధ్యతల స్వీకరించారు. గత అనుభవాలతో.. ఈసారి మరింత బాధ్యతగా, వేగంగా పని చేస్తానంటూ నారాయణ వెల్లడించారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా.. తన పేషీ అధికారులతో పాటు.. టీడీపీ నాయకులు, రాజధాని రైతులు మంత్రి నారాయణకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో ఎటువంటి మార్పులు ఉండవన్నారు. రెండున్నరేళ్లలో అమరావతిలో మేజర్ వర్క్స్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఖచ్చితమైన టైం బౌండ్‌తో రాజధాని పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి.

రాష్ట్ర రాజధానిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు మంత్రి నారాయణ. చిన్న లిటిగేషన్ కూడా లేకుండా.. 34వేల ఎకరాలు సేకరిస్తే.. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. రైతుల కౌలు కూడా సరిగ్గా ఇవ్వలేదంటూ మంత్రి మండిపడ్డారు.

మూడు ఫేజుల్లో రాజధాని పనులు పూర్తి చేస్తామన్నారు. ఫేజ్-1లో సిటీ వర్క్స్ అన్నీ పూర్తవుతాయని చెప్పారు. ఫేజ్-2లో మెట్రో నిర్మాణం, రాజధాని కనెక్టివిటీ పనులు ఉంటాయని చెప్పారు. ఫస్ట్ ఫేజ్ పనులు రెండున్నరేళ్లలో పూర్తవుతాయని అంచనా వేస్తున్నామన్నారు నారాయణ.

అమరావతి మొత్తం 217చదరపు కిలోమీటర్లు అన్నారు మంత్రి నారాయణ. ఇందులో చిన్న పెద్ద కలిపి.. 3వేల 600 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటాయని చెప్పారు. రోడ్లతో పాటు.. అధికారుల నివాసాలు, సెక్రటేరియేట్ కోసం కట్టే 5 భవనాలు, అసెంబ్లీ రాజధాని నిర్మాణంలో మేజర్ పార్ట్స్ అన్నారు మంత్రి.

కాగా.. మంత్రి నారాయణ అమరావతి నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన ఛార్జ్ తీసుకోగానే రాజధానికి భూములు ఇచ్చిన రైతులంతా వచ్చి ఆయన్ను కలిసారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..