Andhra Pradesh: ఛీ.. ఛీ.. ఈమె కూతురు కాదు రాక్షసి.. ఇద్దరితో ప్రేమాయణం.. తప్పు అని చెప్పిన తండ్రినే..

రెండేళ్ల క్రితం తల్లి చనిపోయింది.. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. కూతురు బీఈడీ చదివింది.. ఒక్కతే కూతురు.. తనలాగే మంచి పేరు సంపాదించుకుంటుంది అనుకున్నాడు.. ఆ తండ్రి.. కానీ.. ఆమె అడ్డదారులు తొక్కింది.. ఇద్దరితో ప్రేమాయణం నడిపింది.. ఈ విషయం తెలిసి తండ్రి మందలించాడు.. వేరే మంచి సంబంధం చూసి పెళ్లి చెద్దామనుకున్నాడు..

Andhra Pradesh: ఛీ.. ఛీ.. ఈమె కూతురు కాదు రాక్షసి.. ఇద్దరితో ప్రేమాయణం.. తప్పు అని చెప్పిన తండ్రినే..
Crime News
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 16, 2024 | 11:06 AM

రెండేళ్ల క్రితం తల్లి చనిపోయింది.. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. కూతురు బీఈడీ చదివింది.. ఒక్కతే కూతురు.. తనలాగే మంచి పేరు సంపాదించుకుంటుంది అనుకున్నాడు.. ఆ తండ్రి.. కానీ.. ఆమె అడ్డదారులు తొక్కింది.. ఇద్దరితో ప్రేమాయణం నడిపింది.. ఈ విషయం తెలిసి తండ్రి మందలించాడు.. వేరే మంచి సంబంధం చూసి పెళ్లి చెద్దామనుకున్నాడు.. ఈ క్రమంలోనే అది నచ్చని ఆమె మాస్టర్ స్కెచ్ వేసింది.. ఓ ప్రియుడితో కలిసి కన్నతండ్రినే చంపింది.. ఈ దారుణ ఘటన ఏపీలోని మదనపల్లిలో చోటుచేసుకుంది.. మదనపల్లిలో టీచర్ మర్డర్‌ మిస్టరీ వీడింది.. కూతురే తండ్రిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

వివరాల ప్రకారం.. మదనపల్లి ఎగువ కురువ వంకలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో టీచర్ దొరస్వామి (62) ఫ్యామిలీ నివాసం ఉంటోంది. రెండేళ్ల క్రితం దొరస్వామి భార్య లత అనారోగ్యంతో మృతి చెందడంతో ఇంట్లో తండ్రి, కూతురు మాత్రమే ఉంటున్నారు. అయితే 25 ఏళ్ల హర్షిత ఇద్దరు అబ్బాయిలతో ప్రేమాయణం నడుపుతోంది. ఈ విషయం తెలిసిన దొరస్వామి.. హర్షితకు కుప్పంలో పెళ్లి సంబంధం చూశాడు. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని హర్షిత.. ప్రియుడితో కలిసి ఇంట్లోనే హత్య చేయించింది. జూన్ 13న దొరస్వామి తలపై బలంగా కొట్టడంతో ఆయన మృతిచెందారు.

అయితే.. హత్య జరిగిన సమయంలో కుమార్తె ఇంట్లోనే ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.. దీంతో పోలీసులు హర్షితను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. బీఈడీ చదివిన హర్షిత.. తండ్రినే చంపి ఇప్పుడు కటకటాలపాలవ్వడం మదనపల్లిలో సంచలనంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఆ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? అప్పుడే..
ఆ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? అప్పుడే..
శత్రువులను ఓడించడానికి చాణక్యుడి చెప్పిన విషయాలు పాటించి చూడండి..
శత్రువులను ఓడించడానికి చాణక్యుడి చెప్పిన విషయాలు పాటించి చూడండి..
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం