Watch Video: టీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. నామినేటెడ్ పోస్టులు వారికేనంటూ ప్రకటన..

డే వన్ నుంచే పాలనలో యాక్షన్‌ మొదలుపెట్టిన చంద్రబాబు.. ఇటు పార్టీపరంగానూ నేతలకు అందుబాటులో ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నిన్న రాత్రి టెలికాన్ఫరెన్స్‌లో మంత్రులు, టీడీపీ ముఖ్య నేతలతో మాట్లాడారాయన. అధికారం వచ్చిందని కక్షసాధింపులకు పాల్పడవద్దని వారికి సూచించారు. చట్టప్రకారం జరిగేది జరుగుతుందని చెప్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎలాంటి పనులు చేయొద్దని హితవు పలికారు. అలాగే కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దని చెప్పుకొచ్చారు. బాధ్యత, చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు.

|

Updated on: Jun 16, 2024 | 9:01 AM

ఇక.. నేతలకు గుడ్‌న్యూస్‌ కూడా చెప్పారు చంద్రబాబు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈసారి కూటమి బంపర్‌ మెజార్టీతో విజయం సాధించడంతో.. చాలా మంది పదవులు ఆశించారు. కొన్ని ఈక్వేషన్ల కారణంగా సీనియర్లకు సైతం పదవులు దక్కని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కడా అసంతృప్తికి తావులేకుండా చూసేందుకు.. త్వరలోనే నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కింది స్థాయి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow us