AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage: 72 యేళ్ల వృద్ధుడితో 12 ఏళ్ల బాలికకు పెండ్లి.. సరిగ్గా ముహూర్తం టైంకి అదిరిపోయే ట్విస్ట్!

పాకిస్థాన్‌లోని చర్సద్దా పట్టణం ఘోర సంఘటన వెలుగు చూసింది. డబ్బుకు కక్కుర్తిపడి ఓ తండ్రి తన కన్న కూతురి జీవితాన్ని పనంగా పెట్టాడు. 72 ఏళ్ల వయస్సులో అభంశుభం తెలియని మైనర్‌ బాలికతో వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యాడు. కన్న తండ్రి ఒత్తిడి చేయడంతో వృద్ధుడిని వివాహం చేసుకోవడానికి ఆ చిన్నారి కూడా ఒప్పుకుంది. తీరా నిఖ్ఖాకు అంతా సిద్ధమైన సమయంలో పోలీసులు ఎంట్రీతో సీన్‌ రివర్స్‌ అయ్యింది..

Marriage: 72 యేళ్ల వృద్ధుడితో 12 ఏళ్ల బాలికకు పెండ్లి.. సరిగ్గా ముహూర్తం టైంకి అదిరిపోయే ట్విస్ట్!
Child Marriage In Pakistan
Srilakshmi C
|

Updated on: Jun 16, 2024 | 10:43 AM

Share

ఇస్లామాబాద్‌, జూన్ 16: పాకిస్థాన్‌లోని చర్సద్దా పట్టణం ఘోర సంఘటన వెలుగు చూసింది. డబ్బుకు కక్కుర్తిపడి ఓ తండ్రి తన కన్న కూతురి జీవితాన్ని పనంగా పెట్టాడు. 72 ఏళ్ల వయస్సులో అభంశుభం తెలియని మైనర్‌ బాలికతో వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యాడు. కన్న తండ్రి ఒత్తిడి చేయడంతో వృద్ధుడిని వివాహం చేసుకోవడానికి ఆ చిన్నారి కూడా ఒప్పుకుంది. తీరా నిఖ్ఖాకు అంతా సిద్ధమైన సమయంలో పోలీసులు ఎంట్రీతో సీన్‌ రివర్స్‌ అయ్యింది. తండ్రి పారిపోగా.. పాపం! కదల్లేని ముసలి పెళ్లి కొడుకుని మాత్రం అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బాలిక తండ్రి ఆలమ్‌ సయీద్‌.. బాలికను రూ.5 లక్షలకు (పాక్‌ కరెన్సీ) వృద్ధుడికి విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వృద్ధుడిని 72 యేళ్ల హబీబ్ ఖాన్‌గా గుర్తించారు. నిఖా సమయానికి పోలీసులు రావడంతో వీరి వ్యవహారం బయటపడింది. బాలిక తండ్రి పారిపోవడంతో.. పోలీసులు వృద్ధ పెళ్లి కొడుకుతోపాటు నికాహ్ ఖ్వాన్ (వివాహాన్ని నిర్వహించే వ్యక్తి)ని కూడా అరెస్టు చేశారు. బాలిక తండ్రి ఆలమ్‌ కోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్పారు. వారిద్దరితోపాటు నిఖ్ఖా ఖ్వాన్‌పై చైల్డ్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదుచేశామన్నారు.

కాగా పాకిస్థాన్‌లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌లో ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడి పసి పిల్లలను పెద్ద వాళ్లతో బలవంతంగా వివాహం జరిపిస్తుంటారు. ఇటీవల రాజన్‌పూర్‌, తాట్టాలో ఇలాంటి ఘటనలే వెలుగుచూశాయి. పంజాబ్‌లోని రాజన్‌పూర్‌లో 40 ఏండ్ల వ్యక్తికి 11 ఏండ్ల బాలికతో వివాహం జరించారు. థాట్టాలో 50 ఏండ్ల భూస్వామితో మైనర్‌ బాలిక వివాహం జరుగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాలికను రక్షించి శిశు సంక్షేమ సిభిరానికి తరలించారు. ఈ ఏడాది మే 6న స్వాత్‌లో 13 ఏండ్ల అమ్మాయిని పెండ్లి చేసుకుంటున్న 70 ఏండ్ల వృద్ధుడిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలో నిక్కా ఖ్వాన్‌తోపాటు వివాహానికి హాజరైన పెద్దలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.