Bacteria: వామ్మో.. రెండే.. రెండు రోజుల్లో ప్రాణంతీస్తుంది.. మనిషిని తినే బ్యాక్టీరియా కలకలం.. డేంజరస్ వ్యాధి లక్షణాలివే..

మనిషిని తినే బ్యాక్టీరియా.. చాలా డేంజరస్.. 48 గంటల్లోనే మరణం.. ఎస్‌.. మనిషిని తినే ప్రాణాంతక బ్యాక్టీరియా ఇప్పుడు జపాన్‌ను వణికిస్తోంది. టోక్యో సహా అన్ని నగరాల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుండడంతో జపాన్‌ షేక్‌ అవుతోంది. ఇంతకీ.. అసలు.. ఏంటీ.. మనిషిని తినే బ్యాక్టీరియా?... ఈ వ్యాధి లక్షణాలేంటి?.. పూర్తి వివరాలు తెలుసుకోండి...

Bacteria: వామ్మో.. రెండే.. రెండు రోజుల్లో ప్రాణంతీస్తుంది.. మనిషిని తినే బ్యాక్టీరియా కలకలం.. డేంజరస్ వ్యాధి లక్షణాలివే..
Dangerous Bacteria
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 16, 2024 | 6:49 AM

రెండు రోజుల్లో మనిషి చంపేసే డేంజరస్‌ బ్యాక్టీరియా జపాన్‌లో వేగంగా వ్యాపిస్తోంది. మనిషి మాంసాన్ని తినే ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా జపాన్‌లోని టోక్యోలో శరవేగంగా విస్తరిస్తోంది. స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్(STSS) బ్యాక్టీరియా.. ఇది కరోనా కంటే డేంజరస్.. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా దెబ్బకు జపాన్ వణికిపోతుంది. మనిషి మాంసాన్ని తిని బతికే ఈ బ్యాక్టీరియా కేసులు జపాన్‌లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫెక్షియస్ డీసీజెస్ ప్రకారం.. జూన్ 2 నాటికి 977 కేసులు నమోదు అయ్యాయి. అయితే.. ఈ బ్యాక్టీరియా కేసులు గతేడాది మొత్తం 941 నమోదు కాగా.. ఈ ఏడాది మాత్రం ఇప్పటికే 977 కేసుల దాటడం మరింత భయపెడుతోంది. ముఖ్యంగా.. ఈ ఏడాది ప్రథమార్థంలో టోక్యోలోనే 145 కేసులు నమోదు అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఇక.. ఈ వ్యాధి లక్షణాలను పరిశీలిస్తే.. సాధారణంగా గొంతు నొప్పి, వాపు వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలతో మొదలవుతుంది. కానీ.. క్రమంగా శరీరంలోని అవయవాల నొప్పి, వాపు, జ్వరం, లో బీపీ, శరీర కణజాలాన్ని చంపేసే నెక్రోసిస్ వంటి తీవ్రమైన లక్షాణాలను కలిగి ఉంటుంది. వ్యాధి విజృభించి.. చివరికి అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణానికి దారితీవయచ్చు. ఈ వ్యాధి కేసులు.. 30 ఏళ్లు పైబడినవారిలో అత్యధికంగా నమోదు అవుతుండగా.. 50 ఏళ్లు పైబడినవారికి ప్రమాదకరంగా మారుతోంది. ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు 48 గంటల్లోనే జరుగుతున్నట్లు గుర్తించారు జపాన్‌ శాస్త్రవేత్తలు. ఒక రోగికి ఉదయం పాదంలో వాపు గమనించగా.. మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపిస్తుందని.. ఆ తర్వాత.. 48 గంటల్లోనే.. అంటే రెండు రోజుల్లోనే చనిపోవచ్చని టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్ కికుచి వెల్లడించారు. ఈ లెక్కన STSS బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తోందన్నారు. ఈ బ్యాక్టీరియా వ్యాధి మరణాల రేటు 30 శాతం ఉండడం ప్రమాదకరమని హెచ్చరించారు ప్రొఫెసర్ కికుచి.

రోగుల పేగుల్లో జీవనం, మలం ద్వారా కలుషితం..

ప్రాణాంతక ఈ బ్యాక్టీరియా రోగుల పేగుల్లో జీవిస్తుందని.. మలం ద్వారా చేతులను కలుషితం చేస్తుందన్నారు ప్రొఫెసర్‌ కెన్‌ కికుచి. ఈ క్రమంలో.. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఒంటిపై గాయాలు ఉన్నవారు వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ డేంజరస్‌ బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. ఈ సంవత్సరం జపాన్‌లో కేసుల సంఖ్య 2,500కి చేరుకోవచ్చని, మరణాల రేటు కూడా భయంకరంగా ఉందని చెప్పారు ప్రొఫెసర్ కెన్ కికుచి. మరోవైపు.. సుమారు ఐదు ఐరోపా దేశాలు 2022లో ఈ STSSతో కూడిన ఇన్వాసివ్ గ్రూప్ A స్ట్రెప్టోకోకస్ వ్యాధి కేసుల పెరుగుదలను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందులోనూ.. కొవిడ్ ఆంక్షల ముగింపు తర్వాత ఈ కేసులు పెరిగాయని WHO వెల్లడించింది. మొత్తంగా.. ఈ మనిషిని తినే బ్యాక్టీరియా జపాన్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే.. టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీ హెచ్చరికల నేపథ్యంలో ఈ వ్యాధి కంట్రోల్‌కు జపాన్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!