US Student Visa: ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!

అమెరికా గతేడాది భారతీయ విద్యార్థుల‌కు రికార్డు స్థాయిలో 1.40 ల‌క్షల‌ విద్యార్థి వీసాలు జారీ చేసింది. ఈసారి కూడా అదేస్థాయిలో లేదా అంతకంటే ఎక్కువగానే ఇండియ‌న్ స్టూడెంట్స్ కు వీసాలు జారీ చేసే అవకాశం ఉందని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఎనిమిదో విద్యార్థి వీసా వార్షికోత్సవాన్ని భారత్‌లోని యూఎస్‌ ఎంబసీ గురువారం నిర్వహించింది.

US Student Visa: ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!

|

Updated on: Jun 16, 2024 | 12:59 PM

అమెరికా గతేడాది భారతీయ విద్యార్థుల‌కు రికార్డు స్థాయిలో 1.40 ల‌క్షల‌ విద్యార్థి వీసాలు జారీ చేసింది. ఈసారి కూడా అదేస్థాయిలో లేదా అంతకంటే ఎక్కువగానే ఇండియ‌న్ స్టూడెంట్స్ కు వీసాలు జారీ చేసే అవకాశం ఉందని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఎనిమిదో విద్యార్థి వీసా వార్షికోత్సవాన్ని భారత్‌లోని యూఎస్‌ ఎంబసీ గురువారం నిర్వహించింది. ఈ సంద‌ర్భంగా ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నై, ముంబై, కోల్‌కతా కేంద్రాల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ప్రారంభించింది. దీంతో ఢిల్లీలోని అమెరికా ఎంబసీ వెలుపల భారీ క్యూ కనిపించింది.

అగ్రరాజ్యం విశ్వవిద్యాల‌యాల‌లో చేరుతున్న భారత విద్యార్థుల సంఖ్య ప్రతియేటా అంత‌కంత‌కూ పెరుగుతోంది. అందుకు తగినట్లుగానే అమెరికా కూడా వీసాల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. దీనిలో భాగంగానే 2023లో రికార్డు స్థాయిలో 1.40 లక్షల స్టూడెంట్‌ వీసాలను జారీ చేసింది. మరే దేశానికి ఈ స్థాయిలో వీసాలు ఇవ్వలేదు. 2023లోనే అధిక వీసాలు జారీ అయ్యాయి. ఇదే విషయమై ఇండియాలోని యూఎస్ ఎంబ‌సీ తాత్కాలిక కాన్సుల్‌ జనరల్‌ సయ్యద్‌ ముజ్‌తబా అంద్రాబీ స్పందించారు. 2023తో పోలిస్తే ఈ ఏడాది కూడా విద్యార్థి వీసాల‌ సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని అంచ‌నా వేశారు. వీటిపైనే ప్రధాన దృష్టి సారించామన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న కాన్సులేట్‌ కార్యాలయాల్లో ముమ్మరంగా కృషి చేస్తున్నామని తెలిపారు. గురువారం ఒక్కరోజే 4వేల‌ మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేశామని వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us