Zomato: జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్ సీపీఆర్ కూడా చేస్తారు.!
జొమాటో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. అత్యవసర సమయాల్లో ఉన్నవారికి వైద్య సాయం అందించేలా తమ డెలివరీ పార్ట్ నర్స్‌ను తీర్చిదిద్దింది. ఒకే వేదికపై 4,300 మంది డెలివరీ పార్ట్‌నర్స్‌కు సీపీఆర్ శిక్షణను అందించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఫుడ్ డెలివరీ కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. ముంబయిలో నిర్వహించిన ఓ వేదికలో ఏకంగా 4,300 మంది డెలివరీ పార్టనర్స్‌కు...
జొమాటో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. అత్యవసర సమయాల్లో ఉన్నవారికి వైద్య సాయం అందించేలా తమ డెలివరీ పార్ట్ నర్స్‌ను తీర్చిదిద్దింది. ఒకే వేదికపై 4,300 మంది డెలివరీ పార్ట్‌నర్స్‌కు సీపీఆర్ శిక్షణను అందించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఫుడ్ డెలివరీ కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. ముంబయిలో నిర్వహించిన ఓ వేదికలో ఏకంగా 4,300 మంది డెలివరీ పార్టనర్స్‌కు ప్రథమచికిత్స ఎలా అందించాలో నేర్పించినట్లు గోయల్ ‘‘ఎక్స్’’ వేదికగా తెలిపారు. దీంతో గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నామనీ ప్రస్తుతం జొమాటోలో 30,000 కంటే ఎక్కువ డెలివరీ భాగస్వాములు వైద్యం అందించడానికి, రోడ్‌సైడ్ ఎమర్జెన్సీ సమయంలో సాయం అందించడానికి వృత్తి పరంగా శిక్షణ పొందారనీ రాసుకొచ్చారు. దేశంలోని ఎమర్జెన్సీ హీరోలకు సెల్యూట్ అంటూ ముంబయి ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు జత చేశారు.
తమ డెలివరీ భాగస్వాములు ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్ అందించడానికి వృత్తిపరమైన శిక్షణ పొందినట్లు జొమాటో తన అధికారిక ‘‘ఎక్స్’’ ఖాతా ద్వారా పంచుకుంది. అంతేకాదు ఈ శిక్షణ తీసుకున్నవారి బ్యాగ్‌పై గ్రీన్ కలర్ ‘‘+’’ చిహ్నం ఉంటుందని తెలిపింది. జొమాటో చర్యపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘చాలా గొప్ప ప్రయత్నం’, ‘ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నందుకు అభినందనలు’, ‘డెలివరీ పార్ట్‌నర్స్‌కు మీరు ఇచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగంగా ఉంటుంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

