Telangana: తన రాజకీయ శపథం నెరవేరిన తర్వాత పుట్టింట్లో అడుగు పెట్టిన మహిళ..!
ఖమ్మం జిల్లాలో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. తన రాజకీయ శపథం నెరవేరిన తర్వాత పుట్టింటికి వచ్చింది. పంతం పట్టడం, తమ పంతం నెరవేరిన తరువాతనే గ్రామానికి చేరుకుంది. గ్రామానికి వచ్చిన మహిళకు ఘన స్వాగతం పలికారు కుటుంబసభ్యులు.
ఖమ్మం జిల్లాలో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. తన రాజకీయ శపథం నెరవేరిన తర్వాత పుట్టింటికి వచ్చింది. పంతం పట్టడం, తమ పంతం నెరవేరిన తరువాతనే గ్రామానికి చేరుకుంది. ఐదు సంవత్సరాలు గ్రామానికి దూరంగా ఉండి తన పంతం నెగ్గిన తర్వాత గ్రామానికి వచ్చిన మహిళకు ఘన స్వాగతం పలికారు కుటుంబసభ్యులు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశ్వాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
గత 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తమ అభిమాన నాయకుడు గెలుస్తాడని లేదు తమ అభిమాన నాయకుడు గెలుస్తాడని ఒకే కుటుంబంలోని ఇరువురి మధ్య పందెం జరిగింది. తమ నాయకుడు విజయం సాధించకపోతే తాను తన నాయకుడు విజయం సాధించేవరకు గ్రామంలో అడుగు పెట్టనని శపథం చేసింది. ఐదేళ్ళకు ఆ శపధం నెరవేరడంతో గ్రామంలోకి వచ్చిన మహిళకు గ్రామస్తులు శాలువా కప్పి సన్మానించి, పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి అ మహిళా గ్రామంలోకి అడుగుపెట్టింది. అసలు ఈ పంతం విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన కట్ట విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యుల మధ్య రాజకీయ ఒప్పందం కుదురింది. గత 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని విజయలక్ష్మి తెలుపగా, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు లేదు వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారని ఇద్దరి మధ్య ఒక చిన్న ఒప్పందం పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపడితే ఆ ఐదు సంవత్సరాలు నేను పుట్టిన ఊర్లోకి రాను అని శపథం చేశారు విజయలక్ష్మీ. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడంతో విజయలక్ష్మి ఆ రోజు నుంచి గ్రామంలో ఎలాంటి కార్యక్రమం జరిగిన ఎలాంటి శుభకార్యాలు జరిగినా ఏనాడు ఆ గ్రామానికి రాలేదు. తన కుటుంబ సభ్యుల్లో జరిగిన ఏ శుభకార్యాన్ని కూడా ఆమె హాజరు కాలేదు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు గ్రామంలోని విజయలక్ష్మి నివసిస్తుంది. 2024లో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే సొంత స్వగ్రామం వస్తానని శపథం చేశారు. అన్నట్టుగానే ఐదు సంవత్సరాల తర్వాత సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో విజయలక్ష్మి కల నెరవేరింది. దీంతో విజయలక్ష్మి తిరిగి పుట్టిన ఊరు అయినా కేశవాపురం రావడంతో ఆ గ్రామానికి చెందిన విజయలక్ష్మి కుటుంబ సభ్యులు గ్రామ మహిళలు శాలువతో సత్కరించి, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఐదేళ్లకు పుట్టింటికి రావడం పట్ల విజయలక్ష్మీ సంతోషం వ్యక్తం చేశారు.