Mansoon Troubles: దోబూచులాడుతున్న వానలు.. మొలకెత్తని విత్తనాలకు ట్యాంకర్లతో డ్రిప్పింగ్..!

రుతుపవనాలు సరైన సమయానికి వచ్చి మురిపించినా, దేశవ్యాప్తంగా పలుచోట్ల భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల కుండపోత వర్షాలు కురుస్తుంటే, ఇంకొన్ని చోట్ల గుక్కెడు నీటి కోసం యుద్ధాలు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నా, కొన్నిజిల్లాల్లో చినుకు కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Mansoon Troubles: దోబూచులాడుతున్న వానలు.. మొలకెత్తని విత్తనాలకు ట్యాంకర్లతో డ్రిప్పింగ్..!
Water Tanker
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 17, 2024 | 9:55 AM

రుతుపవనాలు సరైన సమయానికి వచ్చి మురిపించినా, దేశవ్యాప్తంగా పలుచోట్ల భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల కుండపోత వర్షాలు కురుస్తుంటే, ఇంకొన్ని చోట్ల గుక్కెడు నీటి కోసం యుద్ధాలు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నా, కొన్నిజిల్లాల్లో చినుకు కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఆరంభంలో మురిపించిన వానలు అడ్రస్ లేకుండా పోయాయి.. నిండు వేసవిని తలపించే తరహాలో ఎండలు మండిపోతున్నాయి.. అప్పుడప్పుడు కారు మబ్బులు కమ్ముకొస్తున్న వాన చుక్క కంటికి కనిపించడం లేదు. దీంతో విత్తిన విత్తనాలను కాపాడుకోవడం కోసం రైతులు పడరాన్ని పాట్లు పడుతున్నారు. విత్తనాలకు తడి తాకడం కోసం మానవ ప్రయత్నాలు చేస్తున్నారు. ట్యాంకర్లతో నీళ్లు సమకుర్చుకొని విత్తనాలు తడుపుతున్నారు..

జూన్ నెల మొదటి వారంలో పడిన వర్షాలతో రైతులు పంటలు వేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పత్తి విత్తనాల కోసం లైన్లలో నిలబడి కొట్లాడి తెచ్చుకుని.. తొలకరి పలకరింపుతో పంటలు వేశారు. అప్పటి నుంచి మళ్లీ వర్షాల జాడే కనిపించలేదు. గత వారం నుంచి చుక్క చినుకు కరువైంది. పైగా వేసవిలాగే ఎండలు మండిపోతున్నాయి. దీంతో వేసిన పంట ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. తొలకరి జల్లులతో మొలకెత్తిన పత్తి నాశనం అయ్యేలా కనిపిస్తోంది.

ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఓ రైతు తన పంటను కాపాడుకోవడం కోసం ట్యాంకర్లతో నీళ్లను తీసుకొచ్చి ఇలా స్ప్రే చేస్తున్నాడు. వరంగల్‌ జిల్లా కాటారం మండలంలోని చింతకాని, జగ్గయ్యపల్లి గ్రామాల్లో రైతుల ఇలాంటి వినూత్న ప్రయత్నాలతో పంటలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుని.. వాటికి డ్రిప్పింగ్‌ స్ప్రేలను ఏర్పాటు చేసుకుని నీటిని కొడుతున్నారు.

రుతుపవనాల దోబూచులాటతో సరైన వానల్లేవు, కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. ఈ ఏడాదైనా సక్రమంగా వానలు కురుస్తాయనుకున్న రైతులకు కన్నీరే మిగులుతోంది. తొలకరి తర్వాత ఇలాంటి స్థితి ఉంటుందని ఊహించని రైతులు పంటలు వేసి నష్టపోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…