Andhra Pradesh: ఆయ్.. గోదారోళ్ల మర్యాదంటే మాములుగా ఉండదండి మరి.. 152 రకాలతో విందు

గోదావరి జిల్లాల ఆప్యాయతకు మురిసిపోయారు అతిధులు. ఆంధ్రా వంటకాలను రుచి చూసి, ఆహా ఏమి రుచి అంటూ కేరళావాసులు లొట్టలు వేశారు. అతిధి సత్కారం చేయాలంటే గోదావరి వాసుల ప్రత్యేకతే వేరు. కొత్తగా పెళ్ళి జరిగినా, కొత్త అల్లుడు ఇంటికి వచ్చినా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా విందు మాత్రం అదిరిపోవాల్సిందే..! రకరకాల స్వీట్లు, పిండి వంటలు, బిర్యానీలు, నాన్ వేజ్ పచ్చళ్ళు అన్ని రకాలు ఉండాల్సిందే. కొందరైతే వంద రకాలకు పైనే వడ్డిస్తారు.

Andhra Pradesh: ఆయ్.. గోదారోళ్ల మర్యాదంటే మాములుగా ఉండదండి మరి.. 152 రకాలతో విందు
152 Food Items
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 17, 2024 | 11:09 AM

గోదావరి జిల్లాల ఆప్యాయతకు మురిసిపోయారు అతిధులు. ఆంధ్రా వంటకాలను రుచి చూసి, ఆహా ఏమి రుచి అంటూ కేరళావాసులు లొట్టలు వేశారు. అతిధి సత్కారం చేయాలంటే గోదావరి వాసుల ప్రత్యేకతే వేరు. కొత్తగా పెళ్ళి జరిగినా, కొత్త అల్లుడు ఇంటికి వచ్చినా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా విందు మాత్రం అదిరిపోవాల్సిందే..! రకరకాల స్వీట్లు, పిండి వంటలు, బిర్యానీలు, నాన్ వేజ్ పచ్చళ్ళు అన్ని రకాలు ఉండాల్సిందే. కొందరైతే వంద రకాలకు పైనే వడ్డిస్తారు.

ఇదే తరహాలో కేరళ నుండి వచ్చిన అతిధులకు 152 రకాలతో విందు ఏర్పాటు చేశారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన పేరిచర్ల కృష్ణంరాజు. ఏర్పాటు చేసిన152 రకాల వంటకాలను చూసిన కేరళ వాస్తవ్యులకు ఆశ్చర్యానికి లోనయ్యారు. అన్ని రకాల వంటలను చూసి విందు ఇలా కూడా ఇస్తారా అనుకున్నారు కేరళ అతిథులు. కేరళకు చెందిన రికేష్ శర్మ భీమవరంలో జరిగిన జెసిఐ ఇంటర్నేషనల్ సమావేశానికి విచ్చేశారు. ఇంకేముంది భీమవరం అంటేనే మర్యాదలకు, అతిథ్యలకు పుట్టినిల్లు. సుమారు 152 రకాల వంటకాలతో భీమవరం రుచులను చూపించారు.

భీమవరం పట్టణానికి చెందిన పేరిచర్ల కృష్ణంరాజు 152 రకాల వంటకాలతో ” ఆహా ఏమి రుచి” అన్నట్లుగా స్వీట్స్, హాట్స్, వేజ్ అండ్ నాన్ వేజ్ బిర్యానీలు, ప్రూట్స్, వేజ్ అండ్ నాన్ వేజ్ పచ్చళ్ళు మరెన్నో వంటకాలతో ఆంద్రా రుచులు చూపించారు. వంటకాలు చూసిన రికేష్ శర్మ ఆశ్చర్యానికి గురైయ్యారు. ఇన్ని రకాల వంటకాలను ఒకే చోట చూడటం ఇదే మొదటి సారి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నడింపల్లి మహేష్ కుమార్ వర్మ సహా తదితరులు ఈ విందులో పాల్గొని తీరొక్క రుచులను ఆస్వాదించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…