Vastu Tips: ఉత్తర దిశలో ఈ పొరపాట్లు చేస్తున్నారా.? ఇబ్బందులు తప్పవు..

ఇక ఇంట్లో ప్రతీ దిక్కుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఏ వస్తువు ఉండాలనే విషయాన్ని స్పష్టంగా తెలిపారు. ఇలాంటి వాటిలో ఇంటి ఉత్తర దిశ ముఖ్యమైంది. ఇంటిలో ఉత్తర దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇంటికి ఉత్తర దిశ ఆయువు పట్టుగా వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని...

Vastu Tips: ఉత్తర దిశలో ఈ పొరపాట్లు చేస్తున్నారా.? ఇబ్బందులు తప్పవు..
Vastu Tips
Follow us

|

Updated on: Jun 17, 2024 | 1:17 PM

భారతీయులు వాస్తును ఎంతలా విశ్వసిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా హిందూ మతంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇంటి నిర్మాణం మొదటి నుంచి వాస్తును ఫాలో అవుతుంటారు. ఇంటి పునాది నుంచి ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల వరకు ప్రతీ అంశం వాస్తు ప్రకారంగా ఉండాలని చూసుకుంటారు.

ఇక ఇంట్లో ప్రతీ దిక్కుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఏ వస్తువు ఉండాలనే విషయాన్ని స్పష్టంగా తెలిపారు. ఇలాంటి వాటిలో ఇంటి ఉత్తర దిశ ముఖ్యమైంది. ఇంటిలో ఉత్తర దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇంటికి ఉత్తర దిశ ఆయువు పట్టుగా వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఉత్తర దిక్కును లక్ష్మీ దేవి, కుబేరునికి సంబంధించినదిగా చెబుతుంటారు. ఈ దిశలో ఎట్టి పరిస్థితుల్లో భారీ వస్తువులు లేకుండా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. భారీ వస్తువులు ఉంటే.. సుఖ సంతోషాలు దూరమై ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.

* వాస్తు ప్రకారం ఉత్తర దిశలో బూట్లు, చెప్పులు ఎప్పుడూ ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

* ఇంటికి ఉత్తర దిశ ఎప్పుడూ పూర్తిగా మూసి ఉండకూడదు. ఉత్తర దిశను డబ్బు వచ్చే దిశగా చెబుతుంటారు. ఉత్తరంలో తలుపు లేదా కనీసం కిటికీ అయినా ఉండేలా చూసుకోవాలి.

* ఉత్తర దిశలో ఎట్టి పరిస్థితుల్లో డస్ట్‌ లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

* ఇక ఉత్తర దిశలో పొరపాటున కూడా మరుగుదొడ్డి ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దిశలో టాయిలెట్‌ ఉంటే ఇంట్లో ఉండేవారు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..