AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నర్సింగ్‌ స్టూడెంట్‌ సూసైడ్‌.. అసలు కారణం ఇదే

నర్సింగ్‌ స్టూడెంట్‌ సూసైడ్‌.. అసలు కారణం ఇదే

Phani CH
|

Updated on: Feb 07, 2026 | 6:30 PM

Share

తిరుపతి బాలాజీ నర్సింగ్ విద్యార్థిని దీశ్మాంజలి ఆత్మహత్య రాష్ట్రంలో కలకలం రేపింది. కాలేజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ లైంగిక వేధింపులే తన బిడ్డ మరణానికి కారణమని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు సూసైడ్ నోట్, వీడియో కాల్ ఆధారంగా చైర్మన్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యాసంస్థల్లో విద్యార్థినుల భద్రతకు చర్యలు తీసుకోవాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

తమ పిల్లలు చక్కగా చదువుకొని వృద్ధిచెందుతారని ఎన్నో ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లు, కాలేజీలకు పంపుతుంటే.. విద్యార్ధులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు కొందరు కామంతో చూస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా కాలేజ్‌ చైర్మన్‌ లైంగిక వేధింపులకు ఓ నర్సింగ్‌ విద్యార్ధిని బలైపోయింది. ఈ ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. తిరుపతిలోని బాలాజీ నర్సింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న దీశ్మాoజలి ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాలేజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ వేధింపులే తన బిడ్డ మరణానికి కారణమని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. శ్రీకాళహస్తికి చెందిన రమణయ్య, పద్మమ్మ దంపతులు కూలీ పనులు చేస్తూ తమ కుమార్తె దీశ్మాoజలిని నర్సింగ్ చదివిస్తున్నారు. తిరుపతి బ్లిస్ హోటల్ వెనుక ఉన్న బాలాజీ నర్సింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఆమె, రెండ్రోజుల క్రితం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులతో కలిసి కాలేజీ ముందు ఆందోళనకు దిగడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. గత కొంతకాలంగా కాలేజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని దీశ్మాoజలి తన తల్లిదండ్రులకు చెప్పి బాధపడింది. ఈ విషయం బయటకు చెబితే నీ కెరీర్ నాశనం చేస్తానంటూ చైర్మన్ ఆమెను బెదిరించినట్లు తెలుస్తోంది. చైర్మన్ వేధింపులు భరించలేక, తన భవిష్యత్తు ఎక్కడ పాడవుతుందోనన్న భయంతోనే దీశ్మాంజలి ప్రాణం తీసుకుంది. ఇతర విద్యార్థినులు కూడా చైర్మన్ ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు స్పందిస్తూ.. దీశ్మాoజలి ఆత్మహత్యకు చైర్మన్ ప్రవీణ్ కుమారే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. మృతురాలి వద్ద లభించిన సూసైడ్ నోట్, ఆత్మహత్యకు ముందు ఆమె చేసిన వీడియో కాల్ ఆధారాలను సేకరించినట్లు తెలిపారు. నిందితుడు ప్రవీణ్ కుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టామని, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విద్యాసంస్థల్లో ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు

టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు తీసుకున్నముద్దాడ రవిచంద్ర

చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే

మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్.. షాక్ లో అభిమానులు

నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం