AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్.. షాక్ లో అభిమానులు

మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్.. షాక్ లో అభిమానులు

Phani CH
|

Updated on: Feb 07, 2026 | 5:32 PM

Share

ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు డర్హామ్‌ నెట్స్‌లో క్రికెట్ బాల్ ముఖానికి బలంగా తగిలి తీవ్ర గాయమైంది. రక్తస్రావం, వాపుతో ఆందోళన కలిగించినా, వైద్యులు ప్రమాదం లేదని ధృవీకరించారు. స్టోక్స్ తన ధైర్యాన్ని చాటుతూ, అభిమానుల మద్దతుతో త్వరలోనే కోలుకుని మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డర్హామ్‌లో నెట్స్ ట్రెయినింగ్ సెషన్ సమయంలో షాకింగ్‌ ఘటన జరిగింది. నెట్స్ పక్కన నిలబడి ఉన్న సమయంలో క్రికెట్ బాల్ ముఖానికి గట్టిగా తగిలింది. అతని కుడి వైపు ముఖానికి పెద్ద గాయమై తీవ్ర రక్తస్రావం జరిగింది. మైదానంలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా షాకయ్యారు. బాల్ బలంగా తగలడంతో స్టోక్స్ కుడి కన్ను చుట్టూ వాచిపోయి, నల్లగా మారింది. కుడి చెంపపై చిన్న కట్ కూడా అయింది. వైద్యులు వెంటనే ఫస్ట్‌ ఎయిడ్‌ చేసారు. ముక్కులో కాటన్ ప్యాడ్ పెట్టి రక్తస్రావాన్ని ఆపారు. ముఖం మొత్తం రక్తంతో నిండిపోయిన ఫొటో చూసిన అభిమానులు కంగారుపడ్డారు. అయితే బయటకు కనబడినంత ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలియజేసారు. ఘటన తర్వాత బెన్ స్టోక్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ చేసి.. “బాల్ పరిస్థితి ఏలా ఉందో చూడాలి” అని జోక్ చేసాడు. అయితే మైదానంలో జరిగే గాయాలపై జోక్ చేయడం స్టోక్స్‌కు ఇదేమీ కొత్త కాదు. స్టోక్స్ ధైర్యాన్ని అభిమానులు మెచ్చుకున్నారు. “స్పీడీ రికవరీ స్టోక్స్”, “త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలోకి రా.. చూడాలని ఉంది” అంటూ కామెంట్లు పెట్టారు. స్టోక్స్ మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని, ఈ గాయం కూడా స్టోక్స్ ను ఆపలేదని అంటున్నారు. ఇంగ్లాండ్ తర్వాతి టెస్ట్ సిరీస్ జూన్‌ నుంచి న్యూజిలాండ్‌తో లార్డ్స్‌లో ప్రారంభం కానుంది. ఆ మ్యాచ్‌కు ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉండడంతో, స్టోక్స్ పూర్తిగా కోలుకుని ఆడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంతకుముందు జరిగే కౌంటీ చాంపియన్‌షిప్‌లో డర్హామ్ తరపున అతను బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. ఇటీవల ఆషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ 4–1తో ఓడిపోవడంతో స్టోక్స్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా అతని నాయకత్వంపై సమీక్ష చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అభిమానులు మాత్రం బెన్ స్టోక్స్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం

వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు

భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ

సమ్మక్క తమ్ముడి జాతర.. అంకన్నగూడెంలో పూనకాలు

హైప్ పెంచుతున్న కొత్త ప్రపంచాలు.. హిట్ కోసం ఏ మాత్రం తగ్గని దర్శకులు

Follow Us