వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌లోని అమెరికన్లకు పిలుపు
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలను సృష్టించాయి. ఇరాన్‌లో ఉన్న అమెరికా పౌరులకు తక్షణమే దేశం విడిచి వెళ్లమని అమెరికా హెచ్చరించింది, భూమార్గం ద్వారా పొరుగు దేశాలకు చేరుకోమని సూచించింది. కమ్యూనికేషన్, రవాణా ఆంక్షలతో పరిస్థితి దారుణంగా ఉందని తెలిపింది. ట్రంప్ దాడుల హెచ్చరికల నేపథ్యంలో ఒమన్ వేదికగా చర్చలు జరగనున్నాయి, గల్ఫ్ దేశాల జోక్యంతో తాత్కాలికంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. శుక్రవారం ఒమన్ వేదికగా ఇరు దేశాల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ లో ఉంటున్న అమెరికన్లను ఉద్దేశించి అమెరికా అడ్వైజరీ జారీ చేసింది. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూ ఉండకుండా వెంటనే ఆ దేశం నుంచి బయటపడాలని హెచ్చరించింది. విమాన సర్వీసులు రద్దయిన కారణంగా భూమార్గంలోనే దేశం దాటాలని సూచించింది. ఇరాన్ లో పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతున్నాయని చెప్పింది. ఇంటర్నెట్ సేవలపై బ్యాన్, రోడ్లు మూసేయడం, మొబైల్ వాడకంపై ఆంక్షలతో పాటు ఇరాన్ కు విమానాల రాకపోకలు కూడా రద్దయినట్లు తెలిపింది. కమ్యూనికేషన్ మార్గాలు కూడా కట్ అయ్యాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని వెంటనే ఆ దేశం నుంచి బయటపడాలని హెచ్చరించింది. వీలైతే భూమార్గంలో ఇరాన్ పొరుగు దేశాలు ఆర్మేనియా, తుర్కియేలకు చేరుకోవాలని తమ పౌరులకు సూచించింది.ట్రంప్ అడ్వయిజరీతో అమెరికా దాడులు చేయబోతోందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఆ దేశంలో కొనసాగుతున్న నిరసనలకు అమెరికా మద్దతు తెలుపుతోంది. ఆ చర్యలను వెంటనే నిలిపివేయకపోతే అమెరికా దాడులకు దిగుతుందని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. అందుకు తగ్గట్లే అమెరికా బలగాలను, యుద్ధ విమానాలను గల్ఫ్ కు తరలించారు. అదే సమయంలో అణు కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఇరాన్ ను ట్రంప్ హెచ్చరించారు. ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్న ఇరాన్.. స్వదేశంలో జరిగిన భారీ నిరసనల నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు. గల్ఫ్ దేశాలు జోక్యం చేసుకోవడంతో ఇరాన్ పై దాడి చేసే విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇరాన్ తో చర్చలకు అంగీకరించారు. శుక్రవారం ఒమన్ వేదికగా ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ
సమ్మక్క తమ్ముడి జాతర.. అంకన్నగూడెంలో పూనకాలు
హైప్ పెంచుతున్న కొత్త ప్రపంచాలు.. హిట్ కోసం ఏ మాత్రం తగ్గని దర్శకులు
నమ్మించి నట్టేట్లో ముంచేస్తున్న హీరోయిన్స్.. ఎందుకు చేస్తున్నారు ఇలా
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
అరుదైన బావురుపిల్లిని చూసారా ??
నడిరోడ్డుపై ఇంత ఘోరమా? ఆడపిల్లలకు రక్షణ ఏది?
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?

