చిలగడదుంపలు తెలియనివారుండరు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సహజంగానే తీపి రుచి కలిగి ఉండే వీటిల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, మాంగనీస్ వంటి పోషకాలతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది
TV9 Telugu
వీటిని తీసుకోవం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. కాల్చుకుని, వేయించి, ఉడికించి ఎలా తీసుకున్నా ఆరోగ్యానిక మేలు చేస్తాయి
TV9 Telugu
అయితే వీటిని వండే విధానమే రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. వాటిని ఎక్కువగా ప్రాసెసింగ్ చేస్తే గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుందని, ఇలాంటి వాటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి
TV9 Telugu
అయితే వీటిని వండే విధానమే రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. వాటిని ఎక్కువగా ప్రాసెసింగ్ చేస్తే గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుందని, ఇలాంటి వాటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి
TV9 Telugu
కాల్చిన చిలగడదుంపలతో పాటు తెల్లబియ్యం, బంగాళాదుంపలు వంటి వాటిని కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరుగుతాయి. కాల్చిన చిలగడదుంపలు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ షుగర్ వ్యాధి గ్రస్తులు వీటిని కాల్చి తినకూడదు
TV9 Telugu
అలాగే చిలగడదుంపలను వేయించడం వల్ల వాటిలో ఉండే స్టార్చ్ నిర్మాణం మారుతుంది. వేయించడం వల్ల ఇవి చక్కెరతో సమానంగా మారిపోతాయి. దీంతో ఆరోగ్యప్రయోజనాలు తగ్గుతాయి
TV9 Telugu
అన్నింటికంటే చిలగడదుంపలను ఉడికించి తీసుకోవడం మంచి పద్దతని నిపుణులు చెబుతున్నారు. ఉడికించడం వల్ల చిలగడదుంపలు సాధారణం నుంచి మధ్యస్థ గ్లైసెమిక్ సూచికలోకి వస్తాయి
TV9 Telugu
ఇవి గ్లూకోజ్ స్థాయిలను కూడా ఎక్కువగా ప్రభావితం చేయవు. ఎక్కువ సమయం ఉడికించడం వల్ల వాటి స్టార్చ్ నిర్మాణంలో మార్పులు వస్తాయి. అలాగే ఉడికించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు వీటిని ఉడికించి తీసుకోవడమే మంచిది